ఇండోనేషియాలో రెండు రైళ్లు ఢీ

– 14 మంది మహిళల దుర్మరణం

జకార్తా/న్యూదిల్లీ, ఏప్రిల్ 28: ఇండోనేషియాలో రెండు రైళ్లు ఢీకొన్న ఘటనలో 14మంది మృతిచెందగా 84మంది గాయపడ్డారు. దేశ రాజధాని జకార్తా శివారులో ఉన్న బెకాసి వద్ద ఈ ప్రమాదం జరిగింది. శిథిలాల కింద చిక్కుకున్న వారిని తొలగించే ప్రయత్నం జరుగుతుందని రైల్వే అధికారులు చెప్పారు. ఓ కమ్యూటర్ ట్రైన్‌తోపాటు మరో రైలు సోమవారం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 14కు చేరుకున్నట్లు ఇండోనేషియా రైల్వే శాఖ అధికారులు తెలిపారు. గాలింపు పక్రియ ముగిసినట్లు రెస్క్యూ ఏజెన్సీ అధికారులు తెలిపారు. రైల్వే బోగీలు నుజ్జునుజ్జు అయ్యాయని, వాటిల్లో చిక్కుకున్న వారిని తొలగించడం పెద్ద సమస్యగా మారిందని అన్నారు. రైలుకు చెందిన మహిళా బోగీ దెబ్బతిన్నదని, బాధితుల్లో అందరూ మహిళలే ఉన్నట్లు అధికారులు తెలిపారు. బోగీల్లో చిక్కుకున్న ప్రయాణికులను బయటకు తీసేందుకు ఇనుప కడ్డీలను కత్తిరించాల్సి వచ్చింది. స్థానికంగా తిరిగే లోకల్ కమ్యూటర్ రైలు తొలుత ఓ ట్యాక్సీ ఢీకొన్నదని, ఆ తర్వాత అది మళ్లీ దూరం వెళ్లే మరో రైలును ఢీకొన్నట్లు బాబీ తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *