– ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 28: తెలంగాణ కొత్త డీజీపీగా సీవీ ఆనంద్ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. యూపీఎస్సీ ఎంపానెల్ సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. ప్రస్తుతం హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆయన డీజీపీగా ప్రమోషన్ పొందారు. ప్రస్తుత డీజీపీ కె.శివధర్ రెడ్డి ఈనెల 30న ఉద్యోగ విరమణ చేయనున్నారు. రాష్ట్రంలోని సీనియర్ ఐపీఎస్ అధికారుల పేర్ల జాబితాను ఇటీవల యూపీఎస్సీ ప్యానెల్‌కు రాష్ట్ర ప్రభుత్వం పంపింది. ఆ జాబితాలో 1991 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి ఆనంద్‌తోపాటు 1994 బ్యాచ్‌కు చెందిన వినాయక్ ప్రభాకర్ ఆప్టే, సౌమ్యా మిశ్రా ఉన్నారు. వారిలో సీనియర్ అయిన సీవీ ఆనంద్‌ను రాష్ట్ర ప్రభుత్వం కొత్త డీజీపీగా ఎంపిక చేసింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





