తుపాకి మీద కూర్చున్న
‘ కాసు’ల కింద మంట పెట్టిన
నాటి ప్రత్యేకోద్యమ
తెలంగాణ నెత్తుటి సూర్యుల
తొలి అమరపు విజయమిది
యవనాక్షర త్యాగాలకు
స్వేచ్ఛావరణ నివాళిది
సజల జ్వాజ్వల్య
ప్రాణ వసంతాల జాతరిది
ఆ మట్టి కణకణం
అమరుల తెలం’గానం’
ఆవరణంతా
అక్షరాలు మొలిచి
అమరుల ఆశయానికి ఊపిన
పచ్చటి భూమి జెండాలైనాయి
లేళ్ళు నెమళ్ళు కుందేళ్ళు
జీవవైవిధ్యాలు
తొలి అమరుల ఉత్సహా ప్రవాహాలై
పరవల్లైతాయి
వీరుల్ని పురి విప్పి ఆడ్తూ
రోహిత్ వేములతో సంభాషిస్తాయి
సుందరభరిత ఉదయాల్ని చిత్రించే
వసంత కోకిలల్ని చిదిమేసే
ఇనుప జంతువుల నెగబెట్టి
ఈ మట్టితో వ్యాపారమంటే
అమరుల విజయాన్ని
అమ్మకానికి పెట్టినట్టే
(‘హెచ్‌సీయూ’ఏర్పడిన నేపథ్యం లోంచి)
– వడ్డెబోయిన శ్రీనివాస్





ఈ రోజుల్లో డొల్ల సాహిత్యం ఇలాగే అమ్ముడుపోతోంది నాగిని కందాల