‛కాక్రోచ్ ఉద్యమం’ కాంగ్రెస్ కు రాజకీయాస్త్రంగా మారిందా?

“అన్నా హజారే ఉద్యమ పర్యవసానంగా నాటి ప్రతిపక్షం బీజేపీ బలోపేతమైంది. ‘ఆప్’ ఆవిర్భవించింది. అప్పటి ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి పెరిగి, మంత్రులు వరుసగా రాజీనామాలు చేశారు. ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమాన్ని ప్రభుత్వం ప్రారంభంలో కఠినంగా అణచివేసే ప్రయత్నం చేసింది. తర్వాత సత్వర సంప్రదింపులు జరుపుతున్నది. ఈ ఉద్యమం ప్రస్తుత ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌కు రాజకీయ లబ్ధిని చేకూరుస్తున్నది. 2011 ఉద్యమం ముగిసిన తర్వాత బీజేపీ దాన్ని సమర్థవంతంగా తన రాజకీయ ప్రయోజనాల కోసం మలుచుకోగలిగింది. నాటి ప్రతిపక్షం ఉద్యమాన్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్లడం వల్లనే యూపీఏ ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. అదేవిధంగా ఇప్పుడు సీజేపీ సృష్టించిన ఈ రాజకీయ వేడిని కాంగ్రెస్ ఎంతవరకు ముందుకు తీసుకెళ్తుందనేది ఆ పార్టీ సంస్థాగత వ్యూహాలపైనే ఆధారపడి ఉన్నది..”

మేకల ఎల్లయ్య – ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి

2026 జులై 20 మధ్యాహ్నం జాతీయ రాజధాని న్యూదిల్లీ వీధుల్లో చోటుచేసుకున్న సంఘటనలు భారత రాజకీయ యవనికపై కొత్త సమీకరణాలకు బీజం వేశాయి. ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (సీజేపీ) ప్రతిపాదించిన “సంసద్ ఛలో” మార్చ్ సందర్భంగా విద్యార్థులు, యువతపై పోలీసులు జరిపిన లాఠీఛార్జ్, కంటిన్యూయస్ బాష్పవాయు ప్రయోగాలు విద్యా వ్యవస్థ వైఫల్యాలను, ప్రభుత్వ జవాబుదారీతనాన్ని జాతీయ రాజకీయాల్లో ప్రధాన చర్చనీయాంశంగా మార్చాయి..కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ), తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ), శివసేన (ఉద్ధవ్ థాకరే), నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ-శరద్ పవార్), ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) లతో పాటు అరుదుగా బహిరంగ నిరసనలకు స్పందించే బిజూ జనతా దళ్ (బీజేడీ) కూడా నిరసనకారులకు బహిరంగ మద్దతు ప్రకటించింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని ఈ పార్టీలన్నీ ముక్తకంఠంతో డిమాండ్ చేశాయి. ఈ విద్యార్థి ఉప్పెనను తమ రాజకీయ ప్రయోజనాలకు అనుకూలంగా మలుచుకోవడంలో భాగంగా జులై 21న లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అధికారిక నివాసం (7, లోక్ కల్యాణ్ మార్గ్) వెలుపల సడన్‌గా ధర్నాకు దిగడం, తదనంతరం మంత్రుల స్థాయి చర్చలు, పోలీసు అరెస్టులు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఈ పరిణామాలు కాంగ్రెస్ పార్టీకి మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడేందుకు ఒక పదునైన రాజకీయ అస్త్రంగా మారాయా లేక ప్రాంతీయ పార్టీల అంతర్గత విభేదాల మధ్య ఇది కేవలం ఒక తాత్కాలిక రాజకీయ సంధిగా మిగిలిపోతుందా అనే విశ్లేషణ అత్యంత ప్రాధాన్యాన్ని సంతరించుకున్నది.

జాతీయ రాజకీయాల్లో ‘కాక్రోచ్’ కుదుపు కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ప్రస్థానం సామాజిక మాధ్యమాల్లో ఒక వ్యంగ్య స్పందనగా ప్రారంభమై అత్యంత వేగంగా దేశవ్యాప్త పౌర చైతన్య ఉద్యమంగా రూపాంతరం చెందింది. మే 2026లో భారత అత్యున్నత న్యాయస్థానం (సుప్రీంకోర్టు) లో ఒక విచారణ సందర్భంగా నిరుద్యోగ యువతను “రక్తపింజరులు”, “కాక్రోచ్‌లతో (బొద్దింకలతో)” పోలుస్తూ వచ్చిన వ్యాఖ్యలు దేశంలోని జెన్-జెడ్ యువతలో తీవ్ర ఆగ్రహాన్ని రగిల్చాయి. బోస్టన్ యూనివర్సిటీ నుంచి పబ్లిక్ రిలేషన్స్ లో మాస్టర్స్ పూర్తి చేసిన 30 ఏండ్ల అభిజీత్ దీప్కే “దేశంలోని బొద్దింకలన్నీ ఒకటైతే ఎలా ఉంటుంది?” అనే డిజిటల్ పిలుపుతో మే 16న సీజేపీకి రూపకల్పన చేశారు. ఏటా కోట్లాది మంది విద్యార్థుల జీవితాలను శాసించే నీట్-యూజీ, సీబీఎస్ఈ 12వ తరగతి, సీయూఈటీ వంటి పోటీ పరీక్షల్లో వరుసగా జరుగుతున్న ప్రశ్నాపత్రాల లీకేజీలు, మూల్యాంకన అక్రమాలు ఈ ఉద్యమానికి ప్రధాన ఇంధనంగా మారాయి. గత దశాబ్ద కాలంలో 152 పేపర్ లీక్‌లు చోటుచేసుకోవడం, దాదాపు 20 మందికి పైగా అభ్యర్థులు తీవ్ర మనస్తాపంతో ఆత్మహత్యలకు పాల్పడడం యువతలోని నిరాశను ప్రభుత్వంపై తీవ్ర కోపంగా మార్చింది. ఈ డిజిటల్ నిరసన కేవలం రెండు వారాల్లోనే 22 మిలియన్ల (2.2 కోట్లు) ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్లను సాధించి, అధికార బీజేపీ అధికారిక ఖాతాను సైతం దాటిపోయింది. జూన్ 6న అభిజీత్ దీప్కే భారత్‌కు తిరిగి వచ్చిన తర్వాత, ఈ ఉద్యమం డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల నుంచి క్షేత్రస్థాయికి మారింది. జూన్ 20 నుంచి దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సీజేపీ నిర్వహించిన నిరవధిక ధర్నాకు పర్యావరణవేత్త, సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ మద్దతు తెలిపడమే కాకుండా 21 రోజుల పాటు నిరాహార దీక్ష చేపట్టడంతో ఈ నిరసన జాతీయ స్థాయి రాజకీయ సంక్షోభంగా మారింది.

అన్నా హజారే ఉద్యమం వర్సెస్ సీజేపీ పోరాటం ప్రస్తుత సీజేపీ ఉద్యమాన్ని పలువురు రాజకీయ విశ్లేషకులు 2011 నాటి అన్నా హజారే నేతృత్వంలోని ‘ఇండియా అగెనెస్ట్ కరప్షన్’ (ఐఏసీ) ఉద్యమంతో పోలుస్తూ, భిన్నమైన సామాజిక-రాజకీయ కోణాలను ఆవిష్కరిస్తున్నారు. 2011లో నాటి యూపీఏ-2 ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవినీతి అంశంపై బీజేపీ రాజకీయ పోరాటం చేసినప్పటికీ, సాధారణ ప్రజలు అప్పటి ప్రతిపక్షం కంటే అన్నా హజారే వంటి పౌర సమాజ నాయకుడికే ప్రాధాన్యాన్ని ఇచ్చారు. నేడు కాంగ్రెస్ పరిస్థితి కూడా అలాగే ఉన్నది. కాంగ్రెస్ విద్యారంగ సమస్యలపై సుదీర్ఘకాలంగా పోరాడుతున్నప్పటికీ దక్కని ప్రజాదరణ, ఒక సామాన్య విద్యావంతుడైన అభిజీత్ దీప్కే లేవనెత్తినప్పుడు లభించింది. ప్రభుత్వంపై సామాన్యుడి మనసులోని కోపానికి సీజేపీ ఒక గొంతుకగా మారింది. అయితే ఈ రెండు ఉద్యమాల మధ్య నిర్మాణాత్మక వ్యత్యాసాలు ఉన్నాయని విశ్లేషిస్తున్నారు. 2011 ఉద్యమాన్ని అప్పటి ప్రధాన స్రవంతి మీడియా నిరంతరం ప్రసారం చేస్తూ బలోపేతం చేసింది. కానీ 2026లో ప్రధాన మీడియా ఉద్యమకారుల గళాన్ని వినిపించకపోగా, ఉద్యమం వెనుక ఇతర శక్తులు ఉన్నాయనే కోణాన్ని వెతకడానికి ప్రయత్నించింది. అలాగే సోషల్ మీడియా వ్యవస్థ ప్రతి వినియోగదారుడి అభిరుచికి అనుగుణంగా కంటెంట్‌ను చూపించడం వల్ల, దీని ద్వారా ప్రజలను ఎక్కువ కాలం పాటు ఒకే తాటిపై సమీకరించడం కష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.

2011లో ప్రభుత్వ అవినీతిని అరికట్టాలని, లోక్‌పాల్ బిల్లు సాధన కోసం అన్నా హజారే ఉద్యమం సాగింది. ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ నీట్ పేపర్ లీక్‌లు అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని, విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావాలని ఉద్యమం చేస్తున్నది. అన్నా హజారే సుదీర్ఘ అనుభవం ఉన్న సామాజిక కార్యకర్త కాగా ఆయన బీజేపీ మనిషి అని అప్పట్లో తెలియలేదు. ఇప్పుడు ఉద్యమం చేస్తున్న అభిజిత్ దీప్కే ఒక సామాన్య పీఆర్ విద్యార్థి, డిజిటల్ క్రియేటర్. అన్నా హజారేకు ప్రధాన స్రవంతి మీడియా సుదీర్ఘ ప్రత్యక్ష ప్రసారాలు చేస్తూ, ప్రచార మద్దతుగా నిలిచింది. ఇప్పుడేమో విమర్శనాత్మక వైఖరి అవలంభిస్తూ, ఉద్యమం వెనుక కుట్ర కోణాలను అన్వేషిస్తూ దుష్ప్రచారం చేస్తున్నది. అన్నా హజారే ఉద్యమ పర్యవసానంగా నాటి ప్రతిపక్షం బీజేపీ బలోపేతమైంది. ‘ఆప్’ ఆవిర్భవించింది. అప్పటి ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి పెరిగి, మంత్రులు వరుసగా రాజీనామాలు చేశారు. ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమాన్ని ప్రభుత్వం ప్రారంభంలో కఠినంగా అణచివేసే ప్రయత్నం చేసింది. తర్వాత సత్వర సంప్రదింపులు జరుపుతున్నది. ఈ ఉద్యమం ప్రస్తుత ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌కు రాజకీయ లబ్ధిని చేకూరుస్తున్నది. 2011 ఉద్యమం ముగిసిన తర్వాత బీజేపీ దాన్ని సమర్థవంతంగా తన రాజకీయ ప్రయోజనాల కోసం మలుచుకోగలిగింది. నాటి ప్రతిపక్షం ఉద్యమాన్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్లడం వల్లనే యూపీఏ ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. అదేవిధంగా ఇప్పుడు సీజేపీ సృష్టించిన ఈ రాజకీయ వేడిని కాంగ్రెస్ ఎంతవరకు ముందుకు తీసుకెళ్తుందనేది ఆ పార్టీ సంస్థాగత వ్యూహాలపైనే ఆధారపడి ఉన్నది.

మోదీ ప్రభుత్వం ఎందుకు ఆత్మరక్షణలో పడింది?

జులై 20న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తొలిరోజే సీజేపీ పిలుపునిచ్చిన “సంసద్ ఛలో” మార్చ్ దిల్లీ వీధుల్లో పెద్ద ఎత్తున ఉద్రిక్తతకు దారితీసింది. ఊహించని రీతిలో 50,000 మందికి పైగా విద్యార్థులు, యువత జంతర్ మంతర్ వద్దకు చేరుకోవడంతో పోలీసు యంత్రాంగం దిగ్భ్రాంతికి గురైంది. బహుళ అంచెల బారికేడ్లను దాటుకొని పార్లమెంట్ వైపు దూసుకెళ్తున్న నిరసనకారులను అడ్డుకోవడానికి పోలీసులు లాఠీచార్జి చేసి, బాష్పవాయువు ప్రయోగించారు. ఈ ఘటనలో దాదాపు 180 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటన జరిగిన మరుసటి రోజు, జులై 21న భారత రాజకీయాల్లో అత్యంత నాటకీయ ఘట్టం చోటుచేసుకున్నది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే నివాసంలో సమావేశమైన అగ్రనాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, కేసీ వేణుగోపాల్ అత్యంత రహస్యంగా ఒక వ్యూహాన్ని రచించారు. ఖార్గే నివాసం (10, రాజాజీ మార్గ్) నుంచి నేరుగా ప్రధానమంత్రి అధికారిక నివాసమైన 7, లోక్ కల్యాణ్ మార్గ్‌కు చేరుకొని రహదారిపై సడన్ గా ధర్నాకు దిగారు. ఈ ధర్నాలో సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్, ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే కూడా భాగస్వాములయ్యారు. ఈ ఆకస్మిక ముట్టడితో కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఆత్మరక్షణలో పడింది. ప్రధానమంత్రి నివాసం సమీపంలో ప్రతిపక్ష నేత రోడ్డుపై కూర్చోవడం ప్రసార మాధ్యమాల్లో ప్రధాన వార్తగా మారడంతో, మోదీ ప్రభుత్వం తక్షణమే ప్రతినిధులను సంప్రదింపులకు పంపక తప్పలేదు. ప్రధానమంత్రి కార్యాలయ సహాయ మంత్రి జితేంద్ర సింగ్, కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్‌తో కలిసి రాహుల్ గాంధీ వద్దకు వచ్చి చర్చలు జరిపారు.

2014లో నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్షాల నిరసన పట్ల ప్రభుత్వం నుంచి ఇలాంటి సత్వర సంప్రదింపుల స్పందన రావడం ఇదే మొదటిసారి. మంత్రి జితేంద్ర సింగ్ మొదట పార్లమెంట్‌లో నీట్ పేపర్ లీకేజీపై సమగ్ర చర్చకు సిద్ధమని హామీ ఇచ్చారు. అయితే రాహుల్ గాంధీ తన డిమాండ్ పరిధిని పెంచుతూ, చర్చతో పాటు విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, విద్యార్థులపై పెట్టిన కేసుల ఉపసంహరణ కూడా జరగాలని పట్టుబట్టారు. చివరికి పోలీసులు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలతో పాటు ఇతర నాయకులను బలవంతంగా తరలించి ఛత్రసాల్ స్టేడియంలో నిర్బంధించారు. మోదీ ప్రభుత్వానికి సంప్రదాయకంగా మద్దతుగా ఉండే “పట్టణ మధ్యతరగతి వర్గం” 20 శాతం నుంచి 25 శాతం జనాభాలో తీవ్ర అసంతృప్తి రగలడమే ప్రభుత్వం దిగిరావడానికి ప్రధాన కారణమని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. మధ్యతరగతి కుటుంబాలు తమ పిల్లల పోటీ పరీక్షల కోసం జీవితకాల కష్టార్జాన్ని ఖర్చు చేస్తాయి. ప్రశ్నాపత్రాల లీకేజీలు ఈ వర్గం భవిష్యత్తును దెబ్బతీయడంతో, మోదీ ప్రభుత్వ “సమర్థవంతమైన, అవినీతి రహిత పాలన” అనే ప్రతిష్ఠాత్మక ప్రతిబింబం దెబ్బతిన్నది. “సుదీర్ఘ కాలం తర్వాత జాతీయ టీవీ ఛానెళ్లన్నింటిలో రాహుల్ గాంధీ ప్రధాన చర్చనీయాంశంగా మారారు. ప్రభుత్వం ఆత్మరక్షణలో పడిందనే సంకేతాలు ప్రజల్లోకి వెళ్లకుండా ఉండేందుకే తక్షణ చర్చల నాటకానికి తెరతీసింది” అని అంటున్నారు. ఈ రాజకీయ సంక్షోభం వేళ, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గత పోరాటాల దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 1997లో ఒడిశాలో విద్యార్థి నాయకుడిగా (ఏబీవీపీ జాతీయ కార్యదర్శిగా) ఉన్న సమయంలో ధర్మేంద్ర ప్రధాన్ ప్రశ్నాపత్రాల లీకేజీకి వ్యతిరేకంగా సచివాలయం ముందు పోరాడి, పోలీసు లాఠీచార్జీలో గాయపడ్డారు. మూడు దశాబ్దాల క్రితం పేపర్ లీక్‌లపై పోరాడిన నాయకుడే నేడు విద్యాశాఖ మంత్రిగా ఉండి అక్రమాలను అరికట్టలేకపోయారనే విమర్శలు ఆయనను రాజకీయంగా ఇరకాటంలో పడేశాయి.

కాంగ్రెస్ ఆధిపత్యంతో ప్రాంతీయ పార్టీల భయాందోళనలు సీజేపీ సృష్టించిన ఈ ఉద్యమ వేగాన్ని స్వంతం చేసుకోవడంలో ప్రతిపక్షాల మధ్య స్పష్టమైన అంతర్గత విభేదాలు కనిపిస్తున్నాయి. ప్రాంతీయ పార్టీలు తమ సొంత రాష్ట్రాలకే పరిమితమై బలహీనపడడంతో, జాతీయ స్థాయిలో సీజేపీ వేదికను ముందుకు తీసుకెళ్లే సంస్థాగత సామర్థ్యం కేవలం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉన్నది. ఈ పరిణామం ఆమ్ ఆద్మీ పార్టీకి తీవ్ర అసంతృప్తిని కలిగించింది. సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే గతంలో ఆప్ సోషల్ మీడియా విభాగంలో పనిచేసిన అనుభవం ఉన్నప్పటికీ, దిల్లీలో సంస్థాగతంగా ఆప్ బలహీనపడడంతో ఈ ఉద్యమాన్ని తనదిగా మార్చుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్, మాజీ సీఎం ఆతిశీ సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్‌పై ఘాటు విమర్శలు చేశారు. “సీజేపీ జంతర్ మంతర్ ఉద్యమాన్ని బలహీనపరిచేందుకు మోదీయే రాహుల్ గాంధీని తన నివాసం బయట ధర్నాకు కూర్చోబెట్టారు” అని సంజయ్ సింగ్ ఆరోపించగా, “నెల రోజులుగా జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపుతున్న సీజేపీతో మాట్లాడని ప్రభుత్వం, రాహుల్ గాంధీ కూర్చోగానే గంటలో చర్చలకు ఎలా వచ్చింది? ఇది బీజేపీ-కాంగ్రెస్ జుగల్బందీ” అని ఆతిశీ వ్యాఖ్యానించారు. అయితే ఆప్ విమర్శలను సీజేపీ తన అధికారిక సామాజిక మాధ్యమ ఖాతా ద్వారా తక్షణమే తిరస్కరించింది.

“అబద్ధపు భ్రమలను వ్యాప్తి చేయకండి, ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ తన బాధ్యతను నిర్వర్తిస్తున్నారు. కాంగ్రెస్ సేవాదళ్ నిరసనకారులకు అల్పాహారం, న్యాయ సహాయం అందిస్తూ సహాయపడుతున్నది” అని సీజేపీ స్పష్టం చేసింది. రాబోయే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెసే తమ ప్రధాన ప్రత్యర్థి కావడం వల్ల ఆప్ ఈ రకమైన వైఖరిని అవలంబిస్తోందని పలువురు విశ్లేషిస్తున్నారు. మరోవైపు ఉత్తరప్రదేశ్ రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్, ఎంపీ డింపుల్ యాదవ్ క్షేత్రస్థాయిలో సీజేపీకి, రాహుల్ గాంధీకి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. బిజూ జనతా దళ్ (బీజేడీ) మాజీ సీఎం నవీన్ పట్నాయక్ వంటి తటస్థ నాయకుడు కూడా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను డిమాండ్ చేయడం ఈ అంశం రాష్ట్రాల సరిహద్దులు దాటి ఎంత తీవ్రరూపం దాల్చిందో తెలియజేస్తున్నది.

రాహుల్ గాంధీ వ్యూహం సుదీర్ఘకాలంగా రాహుల్ గాంధీ రాజకీయ ప్రయాణంపై రెండు ప్రధాన విమర్శలు ఉన్నాయి. ఒకటి ఆయన రాజకీయ వంశపారంపర్యత. రెండు ఆయన స్థిరత్వం లేని నిలకడలేని రాజకీయ వైఖరి. ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహా ‘ది టెలిగ్రాఫ్’ పత్రికలో రాసిన విశ్లేషణలో, రాహుల్ గాంధీ మంచి ఉద్దేశాలు ఉన్న నాయకుడే అయినప్పటికీ, ఆయనలో రాజకీయ క్రమశిక్షణ, గంభీరత లోపించాయని స్పష్టం చేశారు. బీజేపీ ప్రత్యర్థులు 24×7 రాజకీయాల్లో మునిగి తేలుతుంటే, రాహుల్ గాంధీ కష్టపడి పనిచేస్తారని కానీ అది కేవలం విడతల వారీగా మాత్రమే ఉంటుందని గుహా విమర్శించారు. గాంధీ కుటుంబ ఆధిక్యతే మోదీ అధికారంలో కొనసాగడానికి పరోక్షంగా దోహదపడుతున్నదని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే జులై 21 నాటి 7 లోక్ కల్యాణ్ మార్గ్ ధర్నా రాహుల్ గాంధీ వ్యూహాత్మక వైఖరిలో వచ్చిన ఒక స్పష్టమైన మార్పును సూచిస్తున్నది. సీజేపీ నిర్వాహకుడు అభిజీత్ దీప్కే గతంలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రను, కాంగ్రెస్ రాజకీయాలను తీవ్రంగా విమర్శించారు. అందువల్ల జంతర్ మంతర్ వద్ద సీజేపీ వేదికపైకి వెళ్లి ఒక వెనుకబడిన మద్దతుదారుడిగా మారడం కాంగ్రెస్‌కు ఇష్టం లేదు. విద్యార్థుల అసంతృప్తికి తానే స్వయంగా జాతీయ నాయకత్వం వహించాలని నిర్ణయించుకున్న రాహుల్, నేరుగా ప్రధానమంత్రి ఇంటి ముంగిటకే నిరసనను తీసుకెళ్లడం ద్వారా జాతీయ ప్రసార మాధ్యమాల దృష్టిని ఆకర్షించడంలో విజయం సాధించారు. ఈ ఒక్క చర్య ద్వారా ప్రాంతీయ పార్టీల ఆరోపణలను తిప్పికొడుతూ, మోదీకి నేరుగా సవాలు విసరగల ప్రధాన జాతీయ నేత రాహుల్ గాంధీ మాత్రమేనని నిరూపించుకునే ప్రయత్నం చేశారు.

కాంగ్రెస్ చేతికి రాజకీయ అస్త్రం దొరికిందా? కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆధ్వర్యంలో మొదలైన ఈ విద్యార్థి ఉద్యమం భారత రాజకీయాల్లో ఒక కీలకమైన మార్పుకు సంకేతంగా నిలిచింది. ఇది కేవలం ఒక తాత్కాలిక పరీక్షల వివాదం మాత్రమే కాదు. జనాభాలో గణనీయమైన సంఖ్యలో ఉన్న జెన్-జెడ్ యువత వ్యవస్థాగత వైఫల్యాలపై లేవనెత్తిన తిరుగుబాటు. ఈ ఉద్యమం ద్వారా కాంగ్రెస్ పార్టీకి బీజేపీపై దాడి చేసేందుకు ఒక శక్తివంతమైన వ్యూహాత్మక అస్త్రం లభించింది. ప్రాంతీయ పార్టీలన్నీ బలహీనపడడంతో ఈ అవకాశాన్ని రాజకీయ లబ్ధిగా మార్చుకునే అనుకూలత కాంగ్రెస్‌కే ఎక్కువ ఉన్నది. అయితే దీనిని శాశ్వత ప్రతిపక్ష వేదికగా మలుచుకోవడంలో కాంగ్రెస్‌కు కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. ఆమ్ ఆద్మీ పార్టీ వంటి భాగస్వామ్య పక్షాలు తమ సొంత రాష్ట్రీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ ఆధిపత్యాన్ని అంగీకరించకపోవడం ప్రతిపక్ష ఐక్యతకు ప్రధాన అడ్డంకిగా మారవచ్చు. అదే సమయంలో మోదీ ప్రభుత్వం పార్లమెంట్‌లో చర్చకు అంగీకరించడం ద్వారా ఈ నిరసన తీవ్రతను తగ్గించే వ్యూహాలను అమలు చేస్తున్నది. చివరగా సీజేపీ ఉద్యమం సృష్టించిన ఈ రాజకీయ వేడి తాత్కాలిక సమ్మేళనంగా ముగిసిపోతుందా లేదా అధికార మార్పిడికి దారితీస్తుందా అనేది కాంగ్రెస్ పార్టీ ప్రదర్శించే సంస్థాగత నిలకడపైనే ఆధారపడి ఉంటుంది. యువతలో రగులుతున్న విద్యా, నిరుద్యోగ అసంతృప్తిని నిరంతరం లేవనెత్తుతూ, చట్టసభల వేదికగా సంస్కరణలు సాధించేవరకు ఒత్తిడి తెస్తేనే ఈ ‘కాక్రోచ్ ఉద్యమం’ బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ చేతిలో తిరుగులేని రాజకీయాస్త్రంగా మారుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *