ప్రశాంతంగా గ్రూప్ -3 పరీక్ష..

సుబేదారి ప్రజాతంత్ర నవంబర్ 17 : గ్రూప్ -3 పరీక్షలు ఎలాంటి పొరపాట్లు జరగకుండా పకడ్బందీగా నిర్వహించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. ఆదివారం గ్రూప్-3 పరీక్ష లు జరుగుతున్న బాలసముద్రంలోని శ్రీనివాస గురుకుల్ ఉన్నత పాఠశాల ను కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అని జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. అభ్యర్థులు, ఇన్విజిలేటర్లు ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకురాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఏమైనా సమస్యలు తలెత్తితే అధికారుల దృష్టికి తీసుకురావాలని పరీక్షా కేంద్రం సూప రింటెండెంట్ కు సూచించారు. పరీక్షలను ఎలాంటి పొరపాట్లు జరగకుండా అధికారులందరూ సమన్వయంతో నిర్వహించాలని అన్నారు .ఈ కార్యక్రమంలో పరీక్ష కేంద్రం సూపరింటెండెంట్‌ ఇతర అధికారులు పాల్గొన్నారు.

గ్రూప్ 3 పరీక్షా కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్

వరంగల్, ప్ర‌జాతంత్ర‌ నవంబర్ 17 : వరంగల్ నగరంలో గ్రూప్ – 3 పరీక్షల నిర్వహణ తీరును జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆదివారం పరిశీలించారు. వరంగల్ నగరంలోని వాగ్దేవి కళాశాల, తాళ్ల పద్మావతి కళాశాల, సిల్వర్ క్రౌన్ ఉన్నత పాఠశాలలలో గ్రూప్ 3 పరీక్ష కేంద్రాలను కలెక్టర్ పరిశీలించారు. పరీక్ష గ‌దుల‌ను, వైద్య ఇతర సౌకర్యాలను కలెక్టర్ తనిఖీ చేశారు. పరీక్ష సమయంలో ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా పకడ్బందీగా పరీక్షలు నిర్వహించాలని తెలిపారు. క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే పరీక్ష కేంద్రాలకు అనుమతించాలన్నారు. ఆదేవిధంగా టీటీడీ కళ్యాణ మంటపం పక్కన గల అదనపు కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూములను పరిశీలించి పరీక్ష కేంద్రాలకు తరలించే ప్రక్రియను సిబ్బందిని వివరాలను అడిగి తెలుసుకున్నారు. వరంగల్ జిల్లావ్యాప్తంగా ఆదివారం జరిగిన గ్రూప్ -3 పరీక్ష మొదటి పేపర్ కు ఉదయం 10,913 అభ్యర్థులకు గాను 5,513 మంది హాజరయ్యార‌ని మధ్యాహ్నం గ్రూప్ – 3 రెండవ పరీక్షకు 10,913 మంది అభ్యర్థులకు గాను 5489 మంది అభ్యర్థులు హాజరు, గైరుహాజర‌య్యారు. కలెక్టర్ వెంట ఆర్డీవో సత్యపాల్ రెడ్డి, పరీక్షల రీజినల్ కోఆర్డినేటర్ బత్తిని చంద్రమోహన్, రీజినల్ కోఆర్డినేటర్, సహాయ రీజినల్ కోఆర్డినేటర్ డాక్టర్ సురేష్ బాబు, జిల్లా బయోమెట్రిక్ ఆఫీసర్ డాక్టర్ శ్యామ్ తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *