ఘనంగా గ్రూప్ -1 ర్యాంకర్ అపూర్వకు సన్మానం

హన్మకొండ, ప్రజాతంత్ర, ఏప్రిల్ 6 :  తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల విడుదల చేసిన గ్రూప్-1 ఫలితాలలో రాష్ట్రస్థాయి 15వ ర్యాంకు, మల్టీ జోన్ 1 లో ఏడో ర్యాంకు సాధించిన మంద అపూర్వకు స్థానిక కార్పొరేటర్ గుజ్జుల  వసంత మహేందర్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం చేశారు. మంద అపూర్వ 2022 యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ లో ఆల్ ఇండియాలో  646 ర్యాంకు సాధించి  స్పోర్ట్స్  అథారిటీ ఆఫ్ ఇండియాలో అసిస్టెంట్ డైరెక్టర్ గా మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ శాఖ లో ప్రస్తుతం ముంబైలో పని చేస్తున్నారు.

అపూర్వ బీటెక్ సివిల్ ఇంజనీరింగ్, ఎంటెక్ స్ట్రక్చరల్  ఇంజనీరింగ్ ను ఉస్మానియా యూనివర్సిటీ లో పూర్తి చేశారు. హన్మకొండ కు చెందిన అపూర్వ కు ఆదర్శం వారి తల్లిదండ్రులు. తండ్రి  ఆచార్య మంద అశోక్ కుమార్ కాకతీయ యూనివర్సిటీ అర్థశాస్త్ర విభాగంలో పనిచేసే పదవి విరమణ పొందారు. తల్లి రజని దేవి హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం మాణిక్యపూర్ లో ప్రైమరీ స్కూల్ హెచ్ఎంగా పనిచేస్తున్నారు. అపూర్వకు ఇద్దరు  అన్నయ్యలు ఉన్నారు.

పెద్ద అన్నయ్య అరుణ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అమెరికాలోని కాలిఫోర్నియాలో పనిచేస్తున్నారు. రెండో అన్నయ్య ప్రముఖ ఫార్మసీ కంపెనీకి డైరెక్టర్ గా మహారాష్ట్ర రాష్ట్రంలోని పూణేలో పనిచేస్తున్నాడు. ఇటీవల  మంద అపూర్వకు బి.రఘు కార్తీక్ తో వివాహం జరిగింది. రఘు కార్తీక్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లాలో  శ్రీవెంకటేశ్వర గ్రూప్ ఆఫ్  విద్యాసంస్థలకు మేనేజింగ్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. ఈ కార్యక్రమంలో గుజ్జుల వసంత మహేందర్ తో పాటు స్థానిక పార్టీ కార్యకర్తలు కుటుంబ సభ్యులు బంధువులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page