హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 21: రాష్ట్రంలో ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బదిలీలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ ప్రభుత్వం జీవో 38ను విడుదల చేసింది. ఈ బదిలీల పక్రియ మే 1 నుంచి 31 వరకు జరగనుంది. ఒకేచోట మూడేళ్లు పనిచేసిన ఉద్యోగుల బదిలీలకు సర్కార్ అనుమతి ఇచ్చింది. నాలుగేళ్లకు మించి ఒకేచోట పోస్టింగ్‌లో ఉండరాదని స్పష్టం చేసింది. భార్యాభర్తలు, దివ్యాంగులు, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఉద్యోగులకు ముందుగా ప్రాధాన్యం ఉండనుంది. మొత్తం ఉద్యోగులలో 40 శాతానికి మించకుండా మాత్రమే బదిలీలు చేపట్టాలని సర్కార్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. జూన్ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా మళ్లీ బదిలీలపై నిషేధం అమల్లోకి రానుంది. బదిలీలను కౌన్సెలింగ్ ద్వారా అత్యంత పారదర్శకంగా చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





