– స్పీకర్ తీర్పు కాపీలను సమర్పించాలని హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, జూన్ 25: పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్‌ఎస్‌కు చెందిన 10 మంది ఎమ్మెల్యేల వ్యవహారంపై తెలంగాణ హైకోర్టులో గురువారం విచారణ జరిగింది. గతంలో ఈ ఎమ్మెల్యేలు పార్టీ మారలేదని స్పీకర్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ పలువురు ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్లను కోర్టు పరిశీలించింది. విచారణ సందర్భంగా అనర్హత పిటిషన్లపై స్పీకర్ ఇచ్చిన తీర్పు కాపీలను కోర్టుకు సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. అలాగే పార్టీ మారినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలతో పాటు స్పీకర్ కూడా తమ కౌంటర్ దాఖలు చేయాలని మరోసారి నోటీసులు జారీ చేసింది. ఇంతకుముందు జారీ చేసిన నోటీసులకు సంబంధించి ఇప్పటివరకు కౌంటర్ దాఖలు చేయకపోవడంపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. దీంతో కేసు విచారణను జూలై 22కు వాయిదా వేసింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





