గోదావరి ప్రాజెక్టులకు సమాధి

– ఎపి డైరెక్షన్‌లో నడుస్తున్న జీఆర్‌ఎం‌బీ
– తెలంగాణకు జై అనని రేవంత్‌ ‌సిఎంగా ఉన్నారు
– మాజీ మంత్రి హరీష్‌ ‌రావు
– జయశంకర్‌కు నివాళులు

సిద్దిపేట, ప్రజాతంత్ర, ఆగస్ట్ 6 : తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని, జై తెలంగాణ అని ఏరోజూ అన‌ని వ్య‌క్తి ఈరోజు సీఎంగా ఉన్నారని మాజీ మంత్రి హరీశ్‌ ‌రావు విమర్శించారు. సిద్దిపేట ప్రాంతంతో ప్రొఫెసర్‌ ‌జయశంకర్‌కు ఎంతో అనుబంధం ఉండేదని హరీశ్‌ ‌రావు అన్నారు. ఆచార్య జయశంకర్‌ ‌జయంతి సందర్భంగా విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించిన అనంతరం హరీశ్ ‌మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ వచ్చిందంటే కేసీఆర్‌ ‌పోరాటం, జయశంకర్‌ ‌సార్‌ ఆరాటం వల్లే అని చెప్పారు. గోదావరిలో 380 టిఎంసిల నీళ్లు కేసీఆర్‌ ‌నాయకత్వంలో హక్కుగా సాధించామని గుర్తుచేశారు. తెలంగాణ ఉద్యమం ముఖ్యంగా నీళ్ల కోసమే వచ్చిందని గుర్తు చేసిన హరీష్‌ ‌రావు, కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి మూడేళ్లయినా ప్రాజెక్టులకు సంబంధించి ఒక్క అనుమతి కూడా తీసుకురాలేకపోయిందని దుయ్యబట్టారు. గతంలో 18 సార్లు జీఆర్‌ఎం‌బీ సమావేశాలు జరిగినప్పుడు ఏపీ ప్రభుత్వం తెలంగాణ ప్రాజెక్టులను వ్యతిరేకించినా ఆనాడు తెలంగాణ ప్రభుత్వం వాటిని తిప్పికొట్టి అన్ని అనుమతులు సాధించిందన్నారు. కానీ నేడు చరిత్రలో తొలిసారిగా గతంలో అనుమతులు వచ్చిన ప్రాజెక్టులను కూడా రద్దు చేసి రివ్యూ చేయాలనే అంశాన్ని జీఆర్‌ఎం‌బీ అజెండాలో చేర్చడం శోచనీయమన్నారు. ఈ ప్రభుత్వానికి ప్రాజెక్టులు, నీళ్లపై కనీస సోయి లేదని, ఇప్పటికైనా కళ్లు తెరిచి జీఆర్‌ఎం‌బీ అజెండాను మార్పించాలని, ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఆ సమావేశాన్ని తక్షణమే బహిష్కరించాలని డిమాండ్‌ ‌చేశారు. ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న బనకచర్ల ప్రాజెక్ట్‌ను తెలంగాణ ప్రభుత్వం ఎందుకు అడ్డుకోలేకపోతోందని ప్రశ్నించారు. సమ్మక్క- సారక్క ప్రాజెక్ట్‌కు హైడ్రాలజీ క్లియరెన్స్ ‌వచ్చాక ప్రభుత్వం ఎందుకు వదులుకుంటుందో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. శాఖ స్టేజ్‌-2‌కు సమ్మక్క సారక్క నీళ్లు అవసరమన్నారు. గోదావరి బనకచర్ల ప్రాజెక్టును నిర్మించే విషయంలో ఏపీ సర్కార్‌తో తెలంగాణ సర్కార్‌ ‌లోపాయికారి ఒప్పందం చేసుకుందని హరీశ్‌ ‌రావు ఆరోపించారు. గోదావరి, బనకచర్ల ప్రాజెక్టుల నిర్మాణంలో తెలంగాణ ఏపీ ప్రభుత్వంతో లోపాయికారీ ఒప్పందం చేసుకుందని ఆరోపించారు. ప్రభుత్వం కోర్టులలో వేసిన పిటిషన్ల నిర్వహణ రాక అట్టర్‌ ‌ప్లాప్‌ అయిందని, కనీసం రిట్‌ ‌పిటిషన్‌ ‌వేయడం కూడా ఈ ప్రభుత్వానికి రావడం లేదని ఎద్దేవా చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *