– ఎమ్మెల్సీ కోదండరామ్ పెదవి విరుపు
హైదరాబాద్, ప్రజాతంత్ర,ఆగస్ట్ 6: పదవుల భర్తీపై కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి సరిగా లేదని ఎమ్మెల్సీ కోదండరాం పెదవి విరిచారు. పదవుల భర్తీ ఆలస్యం చేయడం వల్ల కలిగే ప్రయోజనం లేదన్నారు. తెలంగాణ సిద్దాంతకర్త ప్రొ. జయశంకర్ సార్ జయంతి సందర్భంగా ఆయనకు గురువారం ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్సీ కోదండరాం మాట్లాడుతూ విద్యార్థులు, నిరుద్యోగుల అంశంలో బీఆర్‌ఎస్ హయాంలో కంటే ఈ ప్రభుత్వంలో స్పందన బాగుందని రేవంత్ రెడ్డి సర్కారును ప్రశంసించారు. ప్రభుత్వంలో తమ భాగస్వామ్యంపై సంప్రదింపులు చేస్తున్నామని వివరించారు. తమకు ఎమ్మెల్సీ, కార్పొరేషన్ చైర్మన్లు ఇస్తామన్నారని గుర్తు చేశారు. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో పోటీ అంశంపై చర్చిస్తున్నామని చెప్పారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ అంశంపై ప్రభుత్వంతో చర్చిస్తున్నామని పేర్కొన్నారు. గత ప్రభుత్వ వైఖరితో ఈ ప్రభుత్వంపై ఆర్థిక భారం పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ జాతిపిత జయశంకర్ సర్ అని విద్యార్థులే ప్రకటించుకున్నారని ఎమ్మెల్సీ కోదండరాం వివరించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు