-దిలీప్ వి.

ప్రేమే ఎందుకని నన్ను పదేపదే అడుగకు ప్రియా

ఊపిరికి ప్రత్యామ్నాయం చూపించి అప్పుడడుగు నన్ను

క్షతగాత్రుని మనసులాంటిదిప్పుడు నా హృదయం

గాయం మానేదాక పుండు మీదనే ద్యాసున్నట్టు

నా పానమంతా నీ మీదనే కొట్టుకుంటున్నది

నాకు నీపై ప్రేమెంతని మాటిమాటికి పలికించకు సఖి

ఆకాశపు కొలతేంతో చెప్పి అప్పుడడుగు నన్ను

నీవిప్పుడు నాకు నేనే చేసుకున్న గుండెమీది పుండువి

పుండు మానుతుందేమో కానీ బర్ర మానదన్నట్టు

నీవుండకపోవచ్చు కానీ నీ జ్ఞాపకం ఎప్పటికీ మలగనిది

అసంపూర్ణమైనదేదైనా భూమి మీదున్నదంటే

కోరిక, సుఖం, ప్రేమ మాత్రమే

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *