– ఒక్కరోజే ప్రభుత్వానికి రూ.303 కోట్ల ఆదాయం
– 19 రోజుల్లోనే రూ.2 వేల కోట్ల మద్యం విక్రయాలు
– గత ఏడాదితో పోలిసే 37.02 శాతం పెరిగిన ఎక్సైజ్ ఆదాయం
హైదరాబాద్, ప్రజాప్రతంత్ర, అక్టోబర్ 21: రాష్ట్రంలో దసరా పండుగ సీజన్ మద్యం వ్యాపారానికి భారీ ఊతమిచ్చింది. పండుగ పూట మందుబాబుల కొనుగోళ్లతో ఎక్సెజ్ శాఖకు కాసుల వర్షం కురిసింది. అక్టోబర్ మొదటి 19 రోజుల్లోనే రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా రూ.2,054.51 కోట్ల విలువైన మద్యం విక్రయాలు నమోదైనట్లు ఎక్సైజ్ శాఖ అధికారిక గణాంకాలు వెల్లడించాయి. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే అమ్మకాల విలువ 37.02 శాతం పెరగడం గమనార్హం. ముఖ్యంగా బీర్ల విక్రయాల్లో గణనీయమైన పెరుగుదల కనిపించగా ఈనెల 19న ఒక్క రోజే రూ.303.40 కోట్ల విలువైన మద్యం అమ్ముడవడం గమనార్హం. ఎక్సైజ్ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం ఈనెల 1 నుంచి 19వ తేదీ వరకు రాష్ట్రంలో మద్యం అమ్మకాల విలువ రూ.2,054.51 కోట్లకు చేరింది. గత ఏడాది ఇదే సమయంలో నమోదైన విక్రయాలతో పోలిస్తే ఈసారి 37.02 శాతం వృద్ధి నమోదైంది. ఈ నెల ప్రారంభంలో అమ్మకాలు కొంత నెమ్మదిగా సాగినప్పటికీ రెండో వారం నుంచి విక్రయాలు భారీగా పెరిగినట్లు లెక్కలు చెబుతున్నాయి.
పెరిగిన బీర్లు, ఐఎంఎఫ్ఎల్ అమ్మకాలు
ఈనెల 16వ తేదీ నాటికి రూ.1.527.85 కోట్లుగా ఉన్న మొత్తం అమ్మకాల విలువ 19వ తేదీ నాటికి రూ.2 వేల కోట్లను దాటింది. దీంతో దసరా సీజన్లో మద్యం విక్రయాలపై మరోసారి చర్చ మొదలైంది. ఈసారి మద్యం విక్రయాల్లో బీర్ల వాటా ప్రత్యేకంగా కనిపిస్తోంది. 1వ తేదీ నుంచి 19వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా 30.37 లక్షల కేసుల బీర్లు అమ్ముడు అయ్యాయి. గత ఏడాది ఇదే కాలంలో ఈ సంఖ్య 21.55 ల క్షల కేసులుగా ఉంది. అంటే ఈసారి 8.82 లక్షల కేసుల బీర్లు అదనంగా విక్రయం అయ్యాయి. బీర్ల అమ్మకాల్లో 40.9 మొదటిపేజీ తరువాయి…
కూడా పెరిగాయి. గత ఏడాది ఇదే కాలంలో 14.16 లక్షల కేసులుగా ఉన్న అమ్మకాలు.. ఈసారి 18.38 లక్షల కేసులకు చేరుకున్నాయి. ఈసారి మద్యం విక్రయాల్లో 29.80 శాతం వృద్ధి నమోదైంది. మొత్తంగా బీర్లు, ఇతర మద్యం రకాల విక్రయాలు రెండింటిలోనూ పెరుగుదల కని పించింది. దసరా సీజన్ రోజువారీ విక్రయాలు కూడా గణనీయంగా పెరిగాయి. ఈనెల 19న ఒక్కరోజే రూ.303.40 కోట్ల విలువైన మద్యం విక్రయాలు నమోదు అయ్యాయి. గత ఏడాది ఇదే రోజుతో పోలిస్తే అమ్మకాల విలువలో 801.90 శాతం వృద్ధి నమోదైనట్లు అందించిన గణాంకాలు పేర్కొంటు న్నాయి. తెలంగాణ ప్రభుత్వానికి ఎక్సెజ్ శాఖ ఆదాయం సమకూర్చే ముఖ్యమైన విభాగాల్లో ఒకటి. పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో మద్యం విక్రయాలు పెరిగినప్పుడు ప్రభుత్వానికి వచ్చే ఆదాయంపైనా సర్వత్రా ఆసక్తి పెరుగుతుంది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





