– కర్నాటక సీఎం డీకే ఆహ్వానం
– చాముండేశ్వరి అమ్మవారిని దర్శించుకున్న ముఖ్యమంత్రి
హైసూరు, అక్టోబర్ 21 : చారిత్రక మైసూరు దసరా ఉత్సవాల్లో అత్యంత ముఖ్యమైన ఘట్టం జంబూ సవారిలో అందంగా అలంకరించిన ఏనుగుపై బంగారు అంబారీలో కొలువుదీరిన చాముండేశ్వరి అమ్మవారి ఉత్సవమూర్తిని ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి దర్శించుకున్నారు. కన్నడ సంస్కృతిని ప్రతిబింబించే జానపద కళాకారులు, సంగీత బృందాలు, నృత్య బృందాలు, వివిధ సాంస్కృతిక ప్రదర్శనలు ఈ ఊరేగింపులో పాల్గొన్నాయి. రంగురంగుల వస్త్రధారణలు, సంప్రదాయ నృత్యాలు, కళాకారుల ప్రదర్శనలు, అలంకరించిన ఏనుగులు ఈ వేడుకలకు మరింత శోభను తీసుకొచ్చాయి. కర్నాటక నాడ హబ్బ (రాష్ట్ర పండుగ) ఉత్సవాలు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, భక్తి, కళలు, చారిత్రక వారసత్వానికి ప్రతీకగా నిలుస్తాయి. 
కర్నాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఆహ్వానం మేరకు ముఖ్యమంత్రి ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు. కేరళం ముఖ్యమంత్రి వీడీ సతీశన్తోపాటు ఎంతోమంది దేశ, విదేశాలకు చెందిన ప్రముఖులతో కలిసి ఉత్సవాలను వీక్షించారు. మైసూరు రాజభవనం ముందు నిర్వహించిన ఈ దసరా వేడుకల్లో పాల్గొనడానికి ముందు ముఖ్యమంత్రి మైసూరు ప్రజల ఆరాధ్య దైవమైన చాముండేశ్వరి ఆలయానికి వెళ్లి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, ప్రజలందరికీ మంచి జరగాలని అమ్మవారిని ప్రార్థించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





