యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, మార్చి10: యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహ స్వామి వారిని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దర్శించుకున్నారు. వార్షిక బ్రహ్మో త్సవాల్లో భాగంగా యాగశాలలో నిర్వహి స్తున్న మహాపూర్ణాహుతికి హాజరయ్యారు. అదేవి ధంగా చక్రతీర్ధ స్నానంలో పాల్గొన్నారు. అంతకుముందు కొండపైన వీవీఐపీ అతిథి గృహం వద్దకు చేరుకున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.
అక్కడి నుంచి బ్యాటరీ వాహనంపై స్వామివారి మాడ వీధుల గుండా స్వయంభు పంచనరసింహస్వామి వారి దర్శించుకునేందుకు ఆలయంలోకి ప్రవేశించారు. ఆలయ ఉత్తర దిశలో ఏర్పాటు చేసిన యాగశాలలకు వెళ్లి పూర్ణాహుతిలో పాల్గొన్నారు. అనంతరం గర్భగుడిలో స్వయంభు నారసింహుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.





