ఆర్టీసీకి అండగా కాంగ్రెస్ ప్రభుత్వం

– ప్రభుత్వంలో సంస్థ విలీనంతో చిత్తశుద్ధి చాటాం
– మేడే ఉత్సవాల్లో మంత్రి పొన్నం ప్రభాకర్

సిద్దిపేట, ప్రజాతంత్ర, మే1 : ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గత ప్రభుత్వం మాదిరి వారు సమ్మె పట్టించుకోకుండా ఉండలేదన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్టీసీ బస్సు డిపోలో శుక్రవారం నిర్వహించిన మేడే ఉత్సవాల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఇటీవల ఆత్మహత్య చేసుకున్న ఆర్టీసీ న‌ర్సంపేట డిపో డ్రైవర్ శంకర్ గౌడ్‌కు శ్రద్దాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ తమ ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లో మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించామని తెలిపారు. 140 సంవత్సరాలుగా ఏదో ఒక హక్కు డిమాండ్‌తో మేడే నిర్వహించుకుంటున్నామన్నారు. ఆర్టీసీ కార్మికులు సమ్మెకు వెళ్తే వారి ఆకాంక్షలకు అనుగుణంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రివర్గం కార్మిక సంఘాలతో చర్చించి పలు అంశాలపై సానుకూల నిర్ణయం తీసుకున్నట్లు గుర్తు చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం, కార్మిక సంఘాల ఎన్నికలు, కార్మికులకు 11 శాతం పీఆర్సీ ప్రకటించామని స్పష్టం చేశారు. త్వరలోనే కార్మిక సంఘాలకు ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ పక్రియను గుర్తింపు పొందిన సంఘం, అధికారుల కమిటీ పూర్తి చేస్తుందని తెలిపారు. ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా తాము వ్యవహరిస్తున్నామన్నారు. హైదరాబాద్‌లో కొత్తగా 380 రూట్‌లలో కొత్త బస్సులు నడుస్తున్నాయని చెప్పారు. ఏడు లక్షల మంది ప్రయాణికులకు కనెక్టివిటీ పెంచామన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం రవాణా శాఖ మంత్రిగా కార్మికులకు, ప్రభుత్వానికి వారధిగా ఉంటానని స్పష్టం చేశారు. హక్కుల కోసం ఏవిధంగా పోరాడామో ఆ విధంగానే సంస్థ అభివృద్ధికి కార్మికులు సమష్టిగా పనిచేయాలని సూచించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *