– పోలీస్ అధికారులకు హైకోర్టు నోటీసులు
హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 1: ట్రాఫిక్ పెండింగ్ చలాన్ల వ్యవహారంపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ధిక్కరణ కింద డీజీపీ సీవీ ఆనంద్, మాజీ డీజీపీ శివధర్ రెడ్డి, ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డేవిస్ లకుహైకోర్టు నోటీసులు ఇచ్చింది. పెండింగ్ చలాన్లు ఉంటే వాహనాలు సీజ్ చేయొద్దని ఈ ఏడాది జనవరి 20న హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. అయితే ఏప్రిల్ 9న మల్లికార్జున అనే వ్యక్తి బైక్ ను పోలీసులు సీజ్ చేశారు. హైకోర్టు ఉత్తర్వులను ధిక్కరించారని ఆరోపిస్తూ కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలైంది. హోంశాఖ సెక్రటరీ, డీజీపీ, ట్రాఫిక్ అదనపు సీపీ, రవాణా శాఖ కమిషనర్లను ప్రతివాదులుగా పిటిషనర్ చేర్చారు. పిటిషనర్ తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది విజయ్ గోపాల్.. హైకోర్టు ఉత్తర్వులను పోలీసులు అమలు చేయడం లేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. వాహనం ఆర్సీ బుక్ ను చూపించినా ట్రాఫిక్ పోలీసులు అంగీకరించడం లేదని తెలిపారు. ఈ క్రమంలో ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన హైకోర్టు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే నెల 19కి హైకోర్టు వాయిదా వేసింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





