బతుకమ్మ ఫిలిం మేకర్స్ ఛాలెంజ్‌కు మంచి స్పందన

– అక్టోబర్ 2 వరకు గడువు పొడిగింపు

హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 21 : బతుకమ్మ యంగ్ ఫిలిం మేకర్స్ ఛాలెంజ్‌కు విశేష స్పందన లభిస్తోంది. ఈ నేపథ్యంలో ఔత్సాహిక ఫిలిం మేకర్స్ విజ్ఞప్తి మేరకు పోటీలో పాల్గొనే గడువును అక్టోబర్ 2  వరకు పొడిగించారు. ఎఫ్‌డీసీ కార్యాలయంలో తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు, ఎఫ్‌డీసీ మేనేజింగ్ డైరెక్టర్ ఎం.ముకుంద రెడ్డి, ప్రభుత్వ క్రియేటివ్ డైరెక్టర్ కొండా రాజు, జ్యూరీ కమిటీ చైర్మన్ హరీష్ శంకర్ ఆధ్వర్యంలో అన్ని జ్యూరీ కమిటీల సభ్యులతో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. యువతలోని సృజనాత్మక ప్రతిభను ప్రోత్సహించడంతోపాటు ఔత్సాహిక ఫిలిం మేకర్స్‌కు తమ ప్రతిభను చాటుకునేందుకు మరింత అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో గడువును పొడిగించినట్లు తెలిపారు. సమావేశంలో మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డి, సాంస్కృతిక సారథి చైర్‌పర్సన్ వెన్నెల గద్దర్, ఎఫ్‌డీసీ ఈడీ కిషోర్ బాబు, బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, విమలక్క, కాసర్ల శ్యామ్, పొన్నం రవిచంద్ర, అనిల్ జీలా, ఇతర జ్యూరీ సభ్యులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *