గౌలిదొడ్డి గురుకుల పాఠశాల విద్యార్థుల ఆందోళన

18  మంది  అధ్యాపకుల తొలగింపుపై నిరసన
హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 5 : ‌గౌలిదొడ్డి గురుకుల పాఠశాల అధ్యాపకులు, విద్యార్ధులు ఆందోళన చేపట్టారు. గురుకుల పాఠశాల ఔట్‌ ‌సోర్సింగ్‌లో పనిచేసిన 18 మంది అధ్యాపకులను సొసైటీ తొలగించింది. దాంతో బోధన సక్రమంగా జరగకపోవడంతో ఐఐటి, నీట్‌ ‌పాత ఫ్యాకల్టీ కావాలని కళాశాల గేటుముందు విద్యార్థులు ధర్నా చేస్తున్నారు. ఉన్నపళంగా అధ్యాపకులను తొలగించడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పదో తరగతి, ఇంటర్‌లో గౌలిదొడ్డి గురుకుల పాఠశాల విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించారు. ఐఐటి, మెడిసిన్‌లో అత్యధికంగా చేరిన వారిలో గౌలిదొడ్డి విద్యార్థులు ఎక్కువగా ఉన్నారు. కాగా ఉపాద్యాయుల దినోత్సవం రోజున ఉపాధ్యాయులు కోసం విద్యార్థులు ధర్నా చేస్తున్నారు. దాదాపుగా 22 మంది ప్రైవేట్‌ ‌టీచింగ్‌ ‌ఫ్యాకల్టీని అధికారులు తొలగించారు. వారి స్థానంలో కొత్తగా ప్రభుత్వం ఉపాధ్యాయులను అధికారులు నియమించారు. వారికి ఐఐటి, నీట్‌ ‌సిలబస్‌ ‌చెప్పడం రావడం లేదని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *