– ఉచితంగా డాప్లర్ పరీక్ష
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 4 : జాతీయ వాస్క్యులర్ డే సందర్భంగా రక్తనాళాల వ్యాధులపై ప్రజల్లో అవగాహన పెంచడం, ప్రారంభ దశలోనే వాటిని గుర్తించే లక్ష్యంతో కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్ గురువారం ఉచిత వాస్క్యులర్ హెల్త్ చెకప్ నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో ఉచిత డాప్లర్ పరీక్షతోపాటు ప్రముఖ వాస్క్యులర్ సర్జన్, క్లినికల్ డైరెక్టర్ అండ్ హెచ్‌వోడీ వాస్క్యులర్ అండ్ ఎండోవాస్క్యులర్ సర్జరీ, వాస్క్యులర్ ఐఆర్ అండ్ పోడియాట్రిక్ సర్జరీ డాక్టర్ పి.సి.గుప్తా ఉచిత వైద్య సలహాలు అందిస్తారు. నడిచేటప్పుడు కాళ్ల నొప్పి, కాళ్ల వాపు, పాదాల్లో తిమ్మిరి, మానని పాద గాయాలు వంటి ప్రారంభ లక్షణాలను చాలామంది నిర్లక్ష్యం చేస్తారు. దీంతో వ్యాధి(వాస్క్యులర్) తీవ్రమైన దశకు చేరుకున్న తర్వాతే గుర్తించే పరిస్థితి ఉంటోంది. ప్రారంభ దశలోనే గుర్తించి సరైన చికిత్స తీసుకుంటే వైకల్యం, అవయవాల తొలగింపు వంటి తీవ్రమైన సమస్యలను చాలావరకు నివారించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ గుప్తా మాట్లాడుతూ ‘నడిచేటప్పుడు వచ్చే కాళ్ల నొప్పిని చాలామంది వయస్సు పెరిగిన కారణంగా భావిస్తారు. కానీ అది కాళ్లకు రక్తాన్ని సరఫరా చేసే ధమనులు మూసుకుపోతున్న తొలి హెచ్చరిక కావచ్చు. అలాగే కాళ్ల వాపు, పాదాలు చల్లబడటం లేదా మానని గాయాలను కూడా నిర్లక్ష్యం చేయకూడదు. ప్రారంభ దశలోనే పరీక్షలు చేయించుకుంటే సరైన చికిత్స అందించి తీవ్రమైన సమస్యలను నివారించవచ్చు. మధుమేహం, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారు, ధూమపానం చేసే వారు, 50 ఏళ్లు పైబడినవారు వాస్క్యులర్ వ్యాధులకు ఎక్కువగా గురయ్యే ప్రమాదం ఉంది. ఈ ఉచిత పరీక్షల ద్వారా ప్రజలు వ్యాధి ముదరకముందే రక్తప్రసరణను పరీక్షించుకోవాలని కోరుతున్నాం’ అని అన్నారు. కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అభినవ్ జోషి మాట్లాడుతూ ‘వ్యాధి వచ్చిన తర్వాత చికిత్స చేయడం ఎంత ముఖ్యమో దాన్ని ముందుగానే గుర్తించి నివారించడం కూడా అంతే ముఖ్యం.. ఈ కార్యక్రమం ద్వారా ప్రత్యేక వాస్క్యులర్ స్క్రీనింగ్‌ను ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకురావడంతోపాటు, రక్తనాళాల వ్యాధుల ప్రారంభ హెచ్చరిక సంకేతాలపై అవగాహన పెంచడం మా లక్ష్యం’ అన్నారు. డాప్లర్ పరీక్ష పూర్తిగా నొప్పి లేని, శస్త్రచికిత్స అవసరం లేనిది. దీని ద్వారా ధమనులు, సిరల్లో రక్తప్రసరణ సక్రమంగా జరుగుతోందా లేదా, ఎక్కడైనా అడ్డంకులు లేదా ఇరుకుదనం ఉందా అనే విషయాన్ని గుర్తిస్తారు. బంజారాహిల్స్ రోడ్ నెం.10లోని కేర్ హాస్పిటల్స్ ఔట్‌పేషెంట్ విభాగంలో ఈ ఉచిత పరీక్ష అందుబాటులో ఉంటుంది. ముందస్తు అపాయింట్మెంట్ తప్పనిసరి. పరిమిత సంఖ్యలో నమోదు చేసుకుంటారు. అపాయింట్మెంట్ కోసం 040-61 565656లో సంప్రదించవచ్చు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





