ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల

– రేప‌టినుంచి నుంచి 12వ తేదీ వరకు రిజిస్ట్రేషన్స్

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 4 : రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్, డెంటల్ కళాశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో కాంపిటెంట్ అథారిటీ కోటా(కన్వీనర్ కోటా) సీట్లలో ప్రవేశాల కోసం కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ‘నీట’ యÖజీ-2026లో క్వాలిఫై అయిన విద్యార్థులు ఈనెల 5వ తేదీ ఉదయం 6 గంటల నుంచి ఆగస్టు 12 సాయంత్రం 6 గంటల వరకు https://tsmedadm.tsche.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని యూనివర్సిటీ సూచించింది. సీట్ల మ్యాట్రిక్స్‌ను వెబ్ ఆప్షన్లకు ముందు ప్రత్యేకంగా ప్రకటిస్తామని పేర్కొంది. అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకునే ముందు ప్రాస్పెక్టస్‌ను పూర్తిగా చదివి అర్హతలు, రిజర్వేషన్లు, అవసరమైన ధ్రువపత్రాలు, నిబంధనలను పరిశీలించి మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని విశ్వవిద్యాలయం సూచించింది. పూర్తి వివరాలు, సమాచారం కోసం www.knruhs.telangana.gov.in వెబ్‌సైట్‌ను ఎప్పటికప్పుడు పరిశీలించాలని కోరింది.

విద్యార్థులకు ముఖ్యమైన సూచనలు 

ఆన్‌లైన్ దరఖాస్తుతోపాటు అన్ని సర్టిఫికెట్లను తప్పకుండా అప్‌లోడ్ చేయాలి. నమోదు ప్రక్రియ ఒక్కసారి మాత్రమే ఉంటుంది. ప్రతి రౌండ్ కౌన్సెలింగ్‌కు మళ్లీ సర్టిఫికెట్లు అప్‌లోడ్ చేయాల్సిన అవసరం లేదు. సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం తాత్కాలిక మెరిట్ జాబితా విడుదల చేస్తారు. అనంతరం వెబ్ ఆప్షన్లు, కౌన్సెలింగ్ షెడ్యూల్, సీట్ల మ్యాట్రిక్స్‌ను KNRUHS వెబ్‌సైట్‌లో ప్రకటిస్తారు. వెబ్ ఆప్షన్లు ఇచ్చేటప్పుడు కళాశాలల ప్రాధాన్యత క్రమాన్ని జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలి.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *