– మంత్రి శ్రీధర్‌బాబు ఆదేశాలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 4 : రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సెప్టెంబర్ 1వ తేదీ నుంచి కేవలం టీ-ఫైబర్ ద్వారానే ఇంటర్నెట్ సేవలు అందించాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఆదేశించారు. టీ-ఫైబర్ సేవలపై తన కార్యాలయంలో మంగళవారం ఆయన సమీక్షించారు. గడువులోగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ఇంటర్నెట్ సేవలు అందించేలా ఏర్పాట్లు చేయాలని టీ ఫైబర్ అధికారులకు సూచించారు. సెప్టెంబర్ 1 తర్వాత ప్రైవేట్ ఆపరేటర్లకు ప్రభుత్వ కార్యాలయాల్లో ఇంటర్నెట్ నిమిత్తం ఎలాంటి బిల్లులు చెల్లించొద్దని, ‘టీ-స్వాన్’(T-SWAN) నెట్‌వర్క్‌ను నెల రోజుల్లోగా టీ-ఫైబర్‌కు బదిలీ చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రతిష్థాత్మక ‘ఫ్యూచర్ సిటీ’కి కూడా పూర్తిస్థాయిలో టీ-ఫైబర్ ఇంటర్నెట్ సేవలు అందేలా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలన్నారు. రాష్ట్రంలో చేపట్టిన ‘ఇంటింటికి ఇంటర్నె ట్ ’ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని మంత్రి శ్రీధర్‌బాబు తప ఆదేశాల్లో పేర్కొన్నారు. ఈ సమీక్షలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, ఐటీ శాఖ సంయుక్త కార్యదర్శి అనుదీప్ దురిశెట్టి, టీ-ఫైబర్ ఎండీ వేణుప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





