– ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 19: హైదరాబాద్ శివారు శంషాబాద్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పాలమాకుల వద్ద వేగంగా వెళ్తున్న ఇన్నోవా కారు అదుపుతప్పి కల్వర్ట్ ను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతిచెందారు. మరొకరు గాయపడ్డారు. మృతులను వ్యాపారవేత్త కేతావత్ లింబ్య (54), కేతావత్ జమున (45), కత్రావత్ మాన్సింగ్ (48), కేతావత్ వాస్రం (45)గా గుర్తించారు. వీరంతా తమ స్వగ్రామమైన మహబూబ్నగర్ జిల్లా నవాబ్ పేట మండలం మెట్టుగడ్డతండా నుంచి హైదరాబాద్ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ అశోక్ తీవ్రంగా గాయపడ్డారు. కాగా, సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. ప్రమాదానికి అతి వేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్ కారణమని అనుమానిస్తున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





