– ఒంటరిగా వెళుతున్న యువతిపై ఐదుగురు నేపాలీల దాడి
– కేకలు వేయడంతో స్థానికులు వచ్చి దేహశుద్ది
హైదరాబాద్,ప్రజాతంత్ర,మే28:హైదరాబాద్ బషీర్ బాగ్‌లో ఒంటరిగా వెళ్తున్న ఓ యువతి పట్ల కొందరు దుండగులుఅసభ్యంగా ప్రవర్తించారు. బుధవారం రాత్రి బషీర్ బాగ్ సీసీఎస్ కార్యాలయం ఎదురుగా ఈ దారుణం చోటుచేసుకుంది. రోడ్డుపై ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న యువతిని చూసి… ఐదుగురు నేపాలీ యువకులు రెచ్చిపోయారు. నడిరోడ్డుపైనే ఆమె చేయి పట్టి లాగుతూ అసభ్యంగా ప్రవర్తించారు. ఈ ఊహించని పరిణామంతో తీవ్ర భయాందోళనకు గురైన ఆ యువతి.. ధైర్యం చేసి గట్టిగా కేకలు వేసింది.యువతి అరుపులు విన్న చుట్టుపక్కల ప్రజలు, స్థానికులు వెంటనే అప్రమత్తమయ్యారు. పారిపోవడానికి ప్రయత్నించిన ఆ ఐదుగురు నేపాలీలను చుట్టుముట్టి నిర్బంధించారు. నడిరోడ్డుపైనే వారికి స్థానికులు దేహశుద్ధి చేశారు. అనంతరం నిందితులను అబిడ్స్ పోలీసులకు అప్పగించారు. పోలీసుల విచారణలో వీరంతా స్థానికంగా ఉండే ఓ ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌లో పని చేస్తున్నట్లు తేలింది. నిందితులను సునీల్, ఉమేష్, లక్ష్మణ్, పురుషోత్తం, రామ్ గా గుర్తించారు. ఈ ఐదుగురిపై కేసు నమోదు చేసిన అబిడ్స్ పోలీసులు… దర్యాప్తును వేగవంతం చేశారు. నడిరోడ్డుపై, అది కూడా పోలీస్ కార్యాలయం ముందే ఇలాంటి ఘటన జరగడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.