తెలంగాణకు కేంద్రం నిరంతర సహకారం

– కాజీపేటలో 200 ఇంటర్ సిటీ రైళ్ల తయారీకి రంగం సిద్దం
– ప్రధాని మోదీ, రైల్వే మంత్రి అశ్వినీలకు కిషన్ రెడ్డి కృతజ్ఞతలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 29 : కాజీపేట రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్‌కు 200 ఇంటర్‌సిటీ రైళ్ల తయారీ బాధ్యతను ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం అప్పగించడంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం నిరంతర సహకారం అందిస్తోందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ మేరకు సోషల్ విÖడియా ’ఎక్స్‌’ వేదికగా పోస్టు పెట్టారు. రాబోయే అయిదేళ్లలో 200 ఇంటర్‌సిటీ రైళ్లను తయారు చేయాలని రైల్వే శాఖ నిర్ణయించిందని తెలిపారు. దీనిపై సమీక్ష నిర్వహించి ఆ బాధ్యతను కాజీపేట రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్ యÖనిట్‌కు అప్పగిస్తూ రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ నిర్ణయం తీసుకోవడం హర్షణీయమన్నారు. వీటిని సాధారణంగా సుమారు 300 కిలోవిÖటర్ల దూరం ఉన్న మార్గాల్లో నడిపిస్తారని తెలిపారు. ఇంటర్‌సిటీ రైళ్లు గంటకు 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయన్నారు. పట్టణాలు, నగరాల మధ్య ప్రజలు సులభంగా ప్రయాణించేందుకు ఈ రైళ్లు ఉపయోగపడతాయని తెలిపారు. ఇవి సమీప పట్టణాల్లో ఉన్నత విద్య కోసం వెళ్లే విద్యార్థులకు సౌకర్యవంతంగా ఉంటాయని, ఆరోగ్యం, ఉద్యోగం, ఉపాధి కోసం ప్రయాణించే సామాన్య ప్రజలకూ ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయని కిషన్ రెడ్డి తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *