– మంత్రి శ్రీధర్ బాబుకు ఎమ్మెల్యే బండారి వినతి
మేడ్చల్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 12: తెలంగా ణ రాష్ట్ర పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఇటీ వల విడుదల చేసిన పోలీస్ కానిస్టేబుల్ ని యామక నోటిఫికేషన్లో మేడ్చల్-మల్కా జిగిరి, యాదాద్రి-భువనగిరి, హైదరాబాద్ జిల్లాలకు ఖాళీలు ప్రకటించకపోవడంపై ఉ ప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంపై మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుని కలిసి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు గత నెల 7న జారీ చేసిన నోటిఫికేషన్ ద్వారా 7,112 పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసినప్పటికీ మేడ్చల్-మల్కాజిగిరి, యాదాద్రి-భువనగిరి, హైదరాబాద్ జిల్లాలకు ఖాళీలు ప్రకటించలేదని ఎమ్మెల్యే తెలిపారు. ఈ మూడు జిల్లాల్లో నిరుద్యోగ యువత పోలీస్ ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్నారన్నారు. మంత్రి శ్రీధర్ బాబు ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిం చా లని ఎమ్మెల్యే కోరారు. లేదా ఈ మూడు జిల్లాలకు ప్రత్యేకంగా మరో నోటిఫికేషన్ విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ దేవేందర్ రెడ్డి, బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గంధం నాగేశ్వర్ రావు, మహేష్ గౌడ్, జెట్ట కిషోర్ ధర్మారెడ్డి శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు


