రూ.20 లక్షల విలువైన మత్తు పదార్థాలు స్వాధీనం

– కేరళ రాష్ట్రానికి చెందిన ఇద్దరి అరెస్ట్
-‌ వలపన్ని పట్టుకున్న ఫ్యూచర్‌ ‌సిటీ ఎస్‌ఓటి, కడ్తాల పోలీసులు
– విలేకరుల సమావేశంలో మహేశ్వరం జోన్‌ ‌డీసీపీ నారాయణరెడ్డి 

ఆమనగల్లు, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 14 : మహేశ్వరం జోన్‌ ఎస్‌వోటీ, కడ్తాల పోలీసుల సంయుక్త దాడిలో డ్రగ్స్ ‌ముఠా గుట్టు రట్టు చేసి ఇద్దరు నిందితులను అరెస్ట్ ‌చేసి వారి నుంచి సుమారు రూ.20 లక్షల విలువైన 170 గ్రాముల క్రిస్టల్‌ ‌మెథాంఫెటమైన్‌  ‌డ్రగ్స్ ‌స్వాధీనం చేసుకున్నట్లు మహేశ్వరం జోన్‌ ‌డీసీపీ కె.నారాయణ రెడ్డి తెలిపారు. కడ్తాల్‌ ‌పోలీస్‌ ‌స్టేషన్‌ ‌లో ఇన్స్పెక్టర్‌ ‌సైదిరెడ్డి, ఎస్‌ఐలతో కలిసి బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దీనికి సంబంధించి వివరాలను వెల్లడించారు. విశ్వసనీయ సమాచారం మేరకు కడ్తాల్‌ ‌పోలీస్‌ ‌స్టేషన్‌ ‌సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎం. రవీందర్‌ ‌తన సిబ్బందితో కలిసి కడ్తాల్‌ ‌టోల్‌ ‌గేట్‌ ‌సమీపంలో దాడులు నిర్వహించి ముంబై నుండి కడ్తాలకు నల్ల రంగు మారుతి స్విఫ్ట్ ‌కారులో అక్రమంగా క్రిస్టల్‌ ‌మెథాంఫెటమైన్‌ ‌డ్రగ్స్ ‌తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా సిద్ధిక్‌ అనే వ్యక్తి సూచనల మేరకు ముంబైలో గుర్తుతెలియని వ్యక్తి వద్ద డ్రగ్స్ ‌తీసుకొని వాటిని రింకూ ఠాగూర్‌ అనే వ్యక్తికి అప్పగించేందుకు కడ్తాల్‌ ‌టోల్‌ ‌గేట్‌ ‌వద్ద వేచి ఉన్నట్లు వెల్లడించారు. సీసీ కెమెరాలు. టోల్‌ ‌గేట్‌ ‌నిఘా వ్యవస్థ ద్వారా తమ వాహనాన్ని గుర్తించకుండా ఉండేందుకు కారు నంబర్‌ ‌ప్లేట్లను తొలగించినట్లు డిసిపి తెలిపారు. కేరళ రాష్ట్రం కాసరగోడు జిల్లాకు చెందిన బవుదల్‌ ఉమర్‌ అబ్దుల్‌ అజీజ్‌, ‌హంసత్‌  ‌షనాష్‌ ‌లను అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. మరో నిందితులు సిద్ధిక్‌ (‌డ్రగ్స్ ‌సరఫరా చేసే వ్యక్తి), రింకు ఠాగూర్‌, (‌డ్రగ్స్ ‌స్వీకరించాల్సిన వ్యక్తి) పరారీలో ఉన్నట్లు వారి కోసం గాలిస్తున్నట్లు డిసిపి తెలిపారు. పట్టుబడ్డ నిందితుల వద్ద నుంచి మొత్తం 170 గ్రాముల క్రిస్టల్‌ ‌మెథాంఫెటమైన్‌ ‌డ్రగ్స్ ‌స్వాధీనం చేసుకున్నామని (50 గ్రాములు, 60 గ్రాములు, 60 గ్రాముల చొప్పున వ•డు ప్యాకెట్లు). వీటి విలువ సుమారు రూ.20 లక్షలు ఉంటుందని ఆయన వెల్లడించారు. మారుతి స్విఫ్ట్ ‌కారు, రెండు ఐఫోన్లు స్వాధీనపరచుకొని సీజ్‌ ‌చేసినట్లు తెలిపారు. ఫ్యూచర్‌ ‌సిటీ పోలీస్‌ ‌కమిషనర్‌ ‌డాక్టర్‌ ‌తరుణ్‌ ‌జోషి పర్యవేక్షణలో డీసీపీ నారాయణ రెడ్డి, ‌ఫ్యూచర్‌ ‌సిటీ అదనపు డీసీపీ షేక్‌ ‌జహంగీర్‌, ‌మహేశ్వరం డివిజన్‌ ఏసీపీ ఎస్‌.జానకీ రెడ్డి మార్గ దర్శకత్వంలో ఈ ఆపరేషన్‌ను విజయవంతం చేశామన్నారు. ఈ ఆపరేషన్‌లో కడ్తాల్‌ ‌ఇన్‌స్పెక్టర్‌ ‌వి.సైదిరెడ్డి, మహేశ్వరం జోన్‌ ఎస్‌ఓటీ ఇన్‌స్పెక్టర్‌  ‌రవికుమార్‌, ఎస్‌ఓటీ ఎస్‌ఐ  ‌సురేష్‌, ‌కడ్తాల్‌ ‌ఎస్‌ఐలు ఎం. రవీందర్‌, ‌బి. చంద్రశేఖర్‌ ‌పోలీస్‌ ‌సిబ్బంది పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *