– నగరంలో నాకాబందీ.. అదుపులో 48మంది
– సీపీ సజ్జనార్ వెల్లడి
హైదరాబాద్, అక్టోబర16: శాంతిభద్రతల థ్యేయంగా ‘ఆపరేషన్ కవచ్’ పేరిట వందమందికిపైగా బృందాలతో నగరంలో గురువారం అర్ధరాత్రి ప్రత్యేక నాకాబందీ నిర్వహించినట్లు నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ శుక్రవారం తెలిపారు. అన్ని జోన్ల డీసీపీల ఆధ్వర్యంలో మూడు వేల మంది పోలీసులతో విస్తృత తనిఖీలు నిర్వహించి 725 వాహనాలు స్వాధీనం చేసుకున్నామని, 48మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నామని వివరించారు. ఈ ఆపరేషన్ కవచ్లో ఐదు మైనర్ డ్రైవింగ్ కేసులు నమోదు చేశామని తెలిపారు. తనిఖీల్లో ఓ ఆయుధాన్ని స్వాధీనం చేసుకోగా రెండు గంజాయి కేసులు నమోదు చేశామని చెప్పారు. అత్యధికంగా గోల్కొండ జోన్లో సరైన పత్రాలు లేని 213 వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. జూబ్లీహిల్స్ జోన్లో 18 వాహనాలు డిటైన్, 8 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. వాహనాల నంబర్ ప్లేట్లను స్పష్టంగా ఉంచుకోవాలని, నంబర్ ప్లేట్లు తారుమారు చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని వాహనదారులను సజ్జనార్ హెచ్చరించారు. నేరాల నియంత్రణకు, రాత్రివేళల్లో మహిళలు, సాధారణ ప్రజలు ఎలాంటి భయం లేకుండా ప్రయాణించేందుకు ఇలాంటి స్పెషల్ డ్రైవ్లు భవిష్యత్తులో కొనసాగుతాయని పోలీసులు స్పష్టం చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





