దిల్లీ హోటల్‌లో ఘోర అగ్నిప్రమాదం

– 21మంది దుర్మరణం చెందినట్లు గుర్తింపు
– ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి

న్యూదిల్లీ, జూన్‌ 3:‌దేశ రాజధాని దిల్లీలోని ఓ హోటల్‌లో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం కారణంగా 21 మంది చనిపోగా 20 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. మల్వియా నగర్‌లోని, హౌజ్‌ ‌రాణీ లైన్‌లో ఐదంతస్తుల భవనం బేస్‌మెంట్‌లో లెమన్‌ ‌గ్రీన్‌ ‌రెస్టారెంట్‌ ఉం‌ది. బుధవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో రెస్టారెంట్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మంటల్లో చిక్కుకుని 21 మంది ప్రాణాలు కోల్పోయారు. 20 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదం జరిగిన సమయంలో హోటల్‌లో 40 మందికి పైగా ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో ఎక్కువమంది మధ్య ఆసియా, ఆఫ్రికాకు చెందిన వారు ఉన్నట్లు సమాచారం. ప్రమాదం జరగడానికి గల కారణాలు తెలియరావాల్సి ఉంది. హోటల్‌లో అగ్నిప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 2లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున ఇస్తామని తెలిపారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *