– ‘యాదాద్రి’ ప్లాంటు కు బొగ్గు కేటాయింపును పట్టించుకోని గత ప్రభుత్వం
– ఈ పవర్ ప్లాంట్ నిర్మాణంతో రాష్ట్రంపై ఆర్థిక భారం
– యూనిటు రూ.6.66 పడుతున్న విద్యుత్ ధర
– బొగ్గు, నీటి వనరులున్న ప్రాంతాల్లోనే ప్లాంట్లు నిర్మించాలి
– నైనీ కోల్ బ్లాక్ కేటాయింపులపై సైతం కత సర్కార్ నిర్లక్ష్యం
– డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
– శాశ్వత బొగ్గు లభ్యత కోసం కేంద్రానికి లేఖలు రాశామని వెల్లడి
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 7: యాదాద్రి పవర్ ప్లాంట్‌కు బొగ్గు కేటాయింపులో గత పాలకులు తప్పిదాలు చేశారని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆరోపించారు. బుధవారం ఆయన మాట్లాడుతూ నైనీ కోల్ బ్లాక్‌ను పదేళ్లపాటు గత ప్రభుత్వం పట్టించుకోలేదు. వ్యక్తిగతంగా నైనీ కోల్ బ్లాక్‌పై సమాచారం సేకరించానన్నారు.సీఎం, మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు, ప్రజలతో మాట్లాడి నైనీలో మైనింగ్ ప్రారంభించాం. నైనీ కోల్ బ్లాక్‌ది ఫిక్స్‌డ్ కేటగిరీ.. పవర్ ప్లాంట్లకు మాత్రమే బొగ్గు కేటాయింపు అని స్పష్టం చేశారు. నైనీ నుంచి వస్తున్న బొగ్గును యాదాద్రికి మళ్లించడం శాశ్వత పరిష్కారం కాదన్నారు. ఇతర ప్లాంట్లకు బొగ్గు కేటాయింపు జరిగే వరకు మాత్రమే యాదాద్రికి బొగ్గు వచ్చే అవకాశం. యాదాద్రికి శాశ్వత బొగ్గు కేటాయింపు కోసం కేంద్రాన్ని కోరుతున్నాం. కోల్ ఇండియాకు లేఖ రాసి బొగ్గు కేటాయింపు కోసం ప్రయత్నిస్తున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా బొగ్గు కేటాయింపునకు చర్యలు చేపట్టామన్నారు. కేంద్ర బొగ్గు కేటాయింపు కమిటీకి కూడా లేఖ రాశాం. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి సైతం బొగ్గు కేటాయింపుపై లేఖ రాశాం. గత ప్రభుత్వ తప్పిదాలను అధిగమిస్తూ యాదాద్రికి బొగ్గు కోసం ప్రయత్నిస్తున్నామని స్పష్టం చేశారు. యాదాద్రి పవర్ ప్లాంట్ వల్ల తక్కువ ధరకు విద్యుత్ లభిస్తుందా? యాదాద్రి విద్యుత్ ఉత్పత్తి ధర యూనిట్‌కు రూ.6.66. కాకతీయ థర్మల్ పవర్ ప్లాంట్ విద్యుత్ ధర యూనిట్‌కు రూ.4.17, భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ విద్యుత్ ధర యూనిట్‌కు రూ.4.60. యాదాద్రి విద్యుత్ ధరే ఎందుకు ఇంత అధికమని ఆయన ప్రశ్నించారు. యాదాద్రి పవర్ ప్లాంట్ దేశంలోనే అత్యధిక వ్యయంతో విద్యుత్ అందించే గ్రిడ్‌గా మారింది. యాదాద్రి అధిక విద్యుత్ ధర భారం అంతిమంగా వినియోగదారులపైనే వినియోగదారులు అంటే తెలంగాణ ప్రజలపైనే పడుతుందన్నారు. యాదాద్రి పవర్ ప్లాంట్ కారణంగా రాష్ట్రంపై అదనపు ఆర్థిక భారం పడుతున్నదన్నారు. యాదాద్రి ప్లాంట్ జీవితకాలం సుమారు 25 ఏళ్లు, ఈ ప్లాంట్ పనిచేసినంత కాలం అధిక విద్యుత్ ధర భారం తప్పదు. బొగ్గు, నీటి వనరులు అందుబాటులో ఉన్న ప్రాంతాల్లోనే పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలి. బొగ్గును లారీలు, రైళ్లు, ఓడల ద్వారా తరలించడం ఖర్చుతో కూడుకున్న ప్రక్రియ. విద్యుత్ గ్రిడ్ అందుబాటులో ఉన్నందున ఎక్కడ ఉత్పత్తి చేసినా వైర్ల ద్వారా విద్యుత్‌ను తరలించవచ్చు. సరైన ప్రణాళిక లేకుండా పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తే డిస్కమ్‌లకు నష్టమన్నారు. గత పాలకుల తప్పుడు నిర్ణయాల భారం రాష్ట్ర ప్రజలు, విద్యుత్ డిస్కమ్‌లపై పడుతుందన్నారు.

ప్రతిపక్షంలో వున్నాం అని ఏది పడితే అది మాట్లాడకూడదు
–హరీశ్‌రావు వ్యాఖ్యలకు డిప్యూటీ సీఎం భట్టి కౌంటర్
పది సంవత్సరాలు అధికారంలో ఉండి ఏం చేశారో చెప్పకుండా.. ప్రతిపక్షంలో ఉన్నాం కదా అని ఏదిపడితే అది మాట్లాడటం సరికాదని హరీష్రావుకు, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హితవు చెప్పారు. ఆయన మాటలు వింటే నవ్వాలో.. ఏడవాలో అర్థం కావడం లేదు. సింగరేణి బొగ్గు బ్లాకుల విషయంలో గత ప్రభుత్వ వైఫల్యాలకు డాక్యుమెంటరీ ఆధారాలు ఉన్నాయి. 2014–2024 మధ్య అందుబాటులో ఉన్న 14 బొగ్గు బ్లాకులను మూసేశారు. కొత్త బొగ్గు బ్లాకుల వేలంలో సింగరేణి పాల్గొనకుండా పక్కన పెట్టారు. వేలంలో పాల్గొని ఉంటే కనీసం కొన్ని బొగ్గు బ్లాకులైనా సింగరేణికి దక్కేవి. 14 బొగ్గు బ్లాకులు మూతపడటంతో 15 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి తగ్గిపోయింది. కొత్త బ్లాకులు తీసుకురాకపోయినా.. సింగరేణి తన పరిధిలో ఉత్పత్తిని పెంచింది. 2014–15లో 52.66 మిలియన్ మెట్రిక్ టన్నుల బొగ్గు ఉత్పత్తి, 2025–26లో 62.07 మిలియన్ మెట్రిక్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసింది. డిస్పాచ్ బొగ్గు బ్లాకులు తగ్గినా.. సింగరేణి ఉత్పత్తిని 62.07 మిలియన్ టన్నులకు పెంచింది. సింగరేణి తన వంతుగా చేయాల్సిందం తా చేస్తూ నిలబడింది. విశాఖపట్నం, కృష్ణపట్నం నుంచి బొగ్గు రవాణాపై 07-12-2016న గత పాలకులు లేఖ రాశారు. లేఖ రాసిన తర్వాత రవాణా ఏర్పాట్లను పూర్తిగా వదిలేశారు. యాదాద్రి పవర్ ప్లాంట్‌పై గత ప్రభుత్వ తప్పిదాలే రెండేళ్ల ఆలస్యానికి కారణం. 50 శాతం విదేశీ బొగ్గు.. 50 శాతం స్వదేశీ బొగ్గు వాడతామని చెప్పి పర్యావరణ అనుమతులు తీసుకున్నారు. ఆ తర్వాత 100 శాతం సింగరేణి బొగ్గు వాడతామని చెప్పి ఎన్జీటీకి వెళ్లారు. ఎన్జీటీ అనుమతులు రద్దు చేసిన తర్వాత ప్రాజెక్టుపై ఫాలోఅప్ చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 2024 ఫిబ్రవరి 20న మళ్లీ పబ్లిక్ హియరింగ్ నిర్వహించాం. ఎన్జీటీ సమస్యలను పరిష్కరించి యాదాద్రి పవర్ ప్లాంట్‌ను పునరుద్ధరించాం. రెండేళ్ల ఆలస్యమైన ప్రాజెక్టును పూర్తి చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. అనుమతులు తీసుకువచ్చి యూనిట్లను వరుసగా కమిషన్ చేస్తున్నాం. సరిపడా బొగ్గు కేటాయింపులు లేకపోయినా ప్రత్యామ్నాయ మార్గాల్లో బొగ్గు సమీకరణ చేస్తున్నాం. యాదాద్రి పవర్ ప్లాంట్‌ను పూర్తి చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోంది. గత ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్దుతూ ముందుకు వెళ్తున్నాం. అభినందించాల్సింది పోయి హరీశ్‌రావు విమర్శలు చేయడం విడ్డూరం. మీ వల్ల జరిగిన పొరపాట్లకు ఇవన్నీ ఆధారసహిత పత్రాలున్నాయి. ఈ తప్పిదాలను వారానికి ఒకసారి ఆధారాలతో ప్రజాక్షేత్రంలో పెడతాం. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలను ఆధారాలతో ఎండగడతాం. పది సంవత్సరాల పాలనలో ఏం చేశారో హరీశ్‌రావు సమాధానం చెప్పాలి. ప్రతిపక్షంలో ఉన్నామనే కారణంతో బాధ్యతారహిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు.
—————————————————————————————————————————————————-
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు