– ఇంధన రంగంలో స్వయం సమృద్ది సాధించాలి
– కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ
న్యూదిల్లీ, ఏప్రిల్ 21: భవిష్యత్తులో 100 శాతం ఇథనాల్ బ్లెండింగ్ సాధించాలని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సూచించారు. పశ్చిమాసియా సంక్షోభంతో ఇంధన సరఫరాలో ఆటంకాలు ఎదుర్కొంటున్నామని గుర్తుచేశారు. ఇలాంటి సమస్యలను అధిగమించేందుకు ఇంధన రంగంలో స్వయం సమృద్ధి సాధించాల్సిన అవసరముందన్నారు. దిల్లీలో మంగళవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్ ఇంధన రంగం 87 శాతం దిగుమతులపైనే ఆధారపడుతోందని, ఇందుకోసం ఏటా రూ.22 లక్షల కోట్లను ఖర్చు చేస్తోందని చెప్పారు. కాలుష్యాన్ని తగ్గించేందుకు ఇంధన ప్రత్యామ్నాయ ఉత్పత్తులపై దృష్టి సారించాలన్నారు. కేవలం ఇథనాల్‌తోనే కాక చెత్త నుంచి హైడ్రోజన్ తయారీ వంటి వినూత్న పద్ధతులకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ముఖ్యంగా పెట్రోల్, డీజిల్‌తో నడిచే వాహనాల వినియోగం తగ్గించాలని గడ్కరీ అన్నారు. పెట్రోల్ ఉత్పత్తుల్లో 20 శాతం ఇథనాల్ వాడకంపై సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న తప్పుడు ప్రచారాలను తోసిపుచ్చారు. అంతేకాక ఆటోమొబైల్ కంపెనీలు వాహనాల ధరల మీదనే కాక ఇథనాల్ వంటి ప్రత్యామ్నాయ ఇంధనాలకు అనుకూలంగా ఉండేలా నాణ్యమైన ఇంజన్ల తయారీపై దృష్టి సారించాలన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




