– జయేష్ రంజన్ కు ఈఎఫ్ఎస్ అండ్ టీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు
– రవాణా, ఆర్ అండ్ బి కార్యదర్శిగా ఇలంబర్తి
– పీఆర్ బాధ్యతలు నవీన్ మిట్టల్ కు కేటాయింపు
– గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కొనసాగనున్న దానకిశోర్
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 28: రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ లు బదిలీ అయ్యారు. పలువురు అధికారులకు కీలక బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ప్రధాన కార్యదర్శులు, ఇతర ఉన్నతాధికారుల బాధ్యతల్లో మార్పులు చేసింది. హెచ్ఎండీఏ పరిధిలోని మెట్రోపాలిటన్ ఏరియా అండ్ అర్బన్ డెవలప్మెంట్ విభాగం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న జయేష్ రంజన్ ను ఈఎస్ఎస్ అండ్ టీ శాఖ ప్రత్యేక్ష ప్రదాన కార్యదర్శిగా బదిలీ చేశారు. ఎఫ్‌టీఆర్ ఐ డైరెక్టర్ జనరల్ బాధ్యతలను కూడా అదనంగా అప్పగించారు. రవాణా, రహదారులు, భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న వికాస్ రాజ్ను ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ఆయన స్థానంలో ఇలంబర్తికి రవాణా, రహదారులు, భవనాల శాఖ కార్యదర్శిగా నియమించారు. అలాగే ఏహెచ్, డీడీ అండ్ ఎఫ్ శాఖ కార్యదర్శి బాధ్యతలు కొనసాగనున్నాయి. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పారిశుద్ద్య శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా దానకిశోర్ ను ప్రభుత్వం తప్పించింది. ఆ బాధ్యతలను నవీన్ మిట్టల్ కు అప్పగించారు. ఇక గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా మాత్రం దానకిశోర్ కొనసాగుతారని స్పష్టం చేశారు. ఆయన రిటైర్మెంట్ తేదీ (ఈనెల 31) వరకు ఆ బాధ్యతల్లో కొనసాగుతారు. శైలజా రామయ్యర్ ను రెవెన్యూ శాఖ (ఎండోమెంట్స్) ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమించారు. జయేష్ రంజన్ నిర్వహిస్తున్న స్పోర్ట్స్, హెరిటేజ్ తెలంగాణ డైరెక్టర్ బాధ్యతలను ఎ.వాణీ ప్రసాద్ కు అదనంగా అప్పగించారు. రెవెన్యూ (డీఎం) శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న రాహుల్ బొజ్జాకు గిరిజన సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బాధ్యతలను అదనంగా అప్పగించారు. ఆయన బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా కూడా కొనసాగనున్నారు. హెచ్ఎండీఏ మెట్రోపాలిటన్ కమిషనర్ గా ఉన్న సర్ఫరాజ్ అహ్మద్ కు హెచ్ఎండీఏ పరిధిలోని మెట్రోపాలిటన్ ఏరియా అండ్ అర్బన్ డెవలప్మెంట్ విభాగంతోపాటు జీహెచ్ఎంసీ, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేక అధికారిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. శృతి ఓజాకు మహిళా, శిశు సంక్షేమం, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమ శాఖల బాధ్యతలు కేటాయించారు. ముషర్రఫ్ అలీ ఫారూఖీకి ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ బాధ్యతలు అప్పగించగా, డాక్టర్ ఎస్.సంగీత సత్యనారాయణను శృతి ఓజా స్థానంలో ప్రత్యేక కార్యదర్శిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ బాధ్యతల ను అదనంగా నిర్వహిస్తున్నజితేష్ వి.పాటిల్‌కు టీజీఎస్‌పీడీసీఎల్, టీజీఆర్‌ఈడీసీఓ బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





