గాల్లో దీపంలా తెలంగాణ విద్యా వ్యవస్థ

విమర్శిస్తూ ఎక్స్‌లో పోస్ట్ ‌చేసిన మాజీ మంత్రి కెటిఆర్‌
‌హిమాచల్‌లో కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం గంజాయి సాగు నిర్ణయం సిగ్గుచేటని కెటిఆర్‌ ‌విమర్శ

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 11 :  ‌కాంగ్రెస్‌ ‌పాలనలో విద్యావ్యవస్థ గాల్లో దీపంలా మారిందని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ అన్నారు. సార్లు లేని బడులు, లెక్చరర్లు లేని కాలేజీలు, చివరకు చాక్‌పీసులు-డస్టర్లులేని స్కూళ్లు, అద్దె చెల్లించలేదని కాలేజీకి తాళాలు, రోడ్లపైకి విద్యార్థులు తెలంగాణలో కనిపిస్తున్నారని తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్‌ ‌ద్వారా కేటీఆర్‌ ‌స్పందిస్తూ…తెలంగాణ విద్యావ్యవస్థలో ఉన్న సమస్యలకు సంబంధించిన పలు వార్తా కథనాలను షేర్‌ ‌చేశారు. పాఠశాలలు ప్రారంభమై నెలలు గడుస్తున్నా గ్రాంట్స్ ‌విడుదల చేయకపోవడం సిగ్గుచేటని కేటీఆర్‌ ‌విమర్శించారు. విద్యా శాఖకు మంత్రి లేడని.. శాఖను దగ్గర పెట్టుకున్న ముఖ్యమంత్రి దిక్కు లేడని అన్నారు. పదుల సంఖ్యలో దిల్లీకి చక్కర్లు కొట్టే ముఖ్యమంత్రి వారి సొంత నియోజకవర్గంలో అధ్యాపకులు లేక విద్యార్థులు లేరని విద్యార్థులు టీసీలు తీస్కుని వెళ్లిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే విద్యా శాఖపై సిఎం ఉన్నత స్థాయి సవి•క్ష జరిపి సమస్యలపై దృష్టి పెట్టాలని సూచించారు. పిల్లల బంగారు భవిష్యత్తుతో చెలగాటం వద్దని సూచించారు.

హిమాచల్‌లో కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం గంజాయి సాగు నిర్ణయం సిగ్గుచేటని కెటిఆర్‌ ‌విమర్శ
హిమాచల్‌ ‌ప్రదేశ్‌లో గ్యారెంటీలు అమలు చేయలేక కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం ప్రజలతో గంజాయి సాగు చేయించేందుకు సిద్ధపడటం సరికాదని బిఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కెటిఆర్‌ ‌విమర్శించారు. ఇంతకన్నా సిగ్గుమాలిన చర్య ఇంకోటి ఉండదని దుయ్యబట్టారు. హిమాచల్‌ ‌ప్రదేశ్‌ ‌ప్రభుత్వం నియంత్రిత పద్ధతిలో గంజాయిసాగు చేయాలని నిర్ణయించడాన్ని తప్పుబట్టారు. గ్యారంటీలు అమలు చేయలేక గంజాయి సాగు చేయమంటారా..ఇది వారి పార్టీ జాతీయ విధానమా అంటూ ట్విటర్‌ ‌వేదికగా కేటీఆర్‌..‌రాహుల్‌ ‌గాంధీని ప్రశ్నించారు. ముందుగా..గంజాయి సాగు చేయాలని నిర్ణయించిన తర్వాత.. రెవెన్యూ శాఖ మంత్రి జగత్‌ ‌సింగ్‌ ‌నేగి నేతృత్వంలో శాస్త్రవేత్తలు, ఉద్యానవన నిపుణులు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో స్పీకర్‌ ఒక కమిటీని ఏర్పాటు చేశారు. తాజాగా, కమిటీ నివేదిక శాసనసభలో ప్రవేశపెట్టగా ఏకగ్రీవ ఆమోదం పొందింది. దీనికి ప్రతిపక్ష బీజేపీ సభ్యులు కూడా మద్దతు ఇవ్వడం విశేషం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page