‘నీట్‌’ అడ్మిట్‌ ‌కార్డుల్లో లోపాలు

– మహారాష్ట్ర విద్యార్థికి అరబ్‌ ఎమిరేట్స్ ‌సెంటర్‌
‌- ఎటిఎకు సమాచారం ఇచ్చిన విద్యార్థి
– పొరపాటును సవరించి, కొత్త కేంద్రం అలాట్‌కు హామీ

న్యూదిల్లీ,జూన్‌20: ‌నీట్‌ ‌రీ-ఎగ్జామ్‌కు సంబంధించి నేషనల్‌ ‌టెస్టింగ్‌ ఏజెన్సీ జారీ చేసిన అడ్మిట్‌ ‌కార్డులో లోపాలు బయటపడ్డాయి. మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌కు చెందిన ఓ అభ్యర్థికి.. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లోని అబుధాబీలో పరీక్షా కేంద్రాన్ని కేటాయించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనిపై స్పందించిన ఎన్‌టీఏ.. సమస్యను పరిష్కరిస్తున్నట్లు తెలిపింది పరీక్షకు ఒకరోజు ముందు ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. నీట్‌ ‌రీటెస్టుకు సమయం దగ్గరపడుతోన్న నేపథ్యంలో అబ్దుల్లా మహ్మద్‌ ‌తాలిబ్‌ అనే అభ్యర్థి.. శుక్రవారం సాయంత్రం తన అడ్మిట్‌ ‌కార్డును డౌన్‌లోడ్‌ ‌చేసుకున్నాడు. అందులో పరీక్షా కేంద్రాన్ని చూసి అవాక్కయ్యాడు. అబుధాబీలోనిఓ భారతీయ స్కూల్‌లో ఎన్‌టీఏ అతడికి పరీక్షా కేంద్రాన్ని కేటాయించింది. ఈ అడ్మిట్‌ ‌కార్డుకు సంబంధించిన ఫొటో ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది. తాము ఇచ్చిన ఆప్షన్లలో అలాంటి కేంద్రం ఏదీ లేదని విద్యార్థి తండ్రి మీడియాతో పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఎన్‌టీఏ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. శనివారం సాయంత్రం 4 గంటల్లోపు కొత్త అడ్మిట్‌ ‌కార్డు జారీ చేస్తామని తమకు హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. సమయం తక్కువగా ఉన్నందున నాగ్‌పుర్‌నే పరీక్షా కేంద్రంగా కేటాయించాలని ఆయన డిమాండ్‌ ‌చేశారు. ఈ సంఘటనతో తన కొడుకు తీవ్ర ఆందోళనలో ఉన్నట్లు తెలిపారు.  ఈ సమస్యపై ఎన్‌టీఏ కూడా స్పందించింది. సాంకేతిక లోపం వల్ల ఇలా జరిగినట్లు పేర్కొంది. సమస్యను పరిష్కరిస్తున్నామని.. కొన్ని గంటల్లోనే ఆ విద్యార్థికి పరీక్షా కేంద్రాన్ని కేటాయిస్తామని స్పష్టంచేసింది. కాగా.. అడ్మిట్‌ ‌కార్డులో వ్యక్తిగత వివరాలు, పరీక్ష కేంద్రాలు ఇతర ముఖ్యమైన అంశాల్లో ఏమైనా లోపాలు ఉంటే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని ఈసందర్భంగా ఎన్‌టీఏ అభ్యర్థులకు సూచించింది. ప్రశ్నపత్రం లీక్‌ ‌నేపథ్యంలో రద్దయిన నీట్‌ ఎం‌ట్రన్స్ ‌పరీక్షను నేడు మరోసారి నిర్వహించనున్న విషయం తెలిసిందే.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *