– వీసీ ప్రొ. ఘంటా చక్రపాణి
-అంబేద్కర్ యూనివర్సిటీలో వనమహోత్సవం
=హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 24: పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని, భావి తరాలకు ఉజ్వల భవిష్యత్ అందించాల్సిన అవసరం ఉందని డా. బి. ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొ. ఘంటా చక్రపాణి పేర్కొన్నారు. “వనమహోత్సవం” వేడుకల్లో భాగంగా విశ్వవిద్యాలయ ప్రాంగణంలోని డా.బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం (అంబేద్కర్ జ్ఞానవనం) వద్ద మొక్కలు నాటారు.ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ అకడమిక్ డైరెక్టర్ ప్రొ.జి. పుష్ప చక్రపాణి, రిజిస్ట్రార్ డా.ఎల్. విజయ కృష్ణ రెడ్డి; ప్రొ.ఆనంద్ పవార్, ప్రొ.పల్లవి కబ్డే, ప్రొ. శ్రీదేవి, ప్రొ. వెంకట రమణ, అన్ని విభాగాల డైరెక్టర్లు, డీన్లు, ఆయా విభాగాల అధిపతులు, బోధన, బోధనేతర ఉద్యోగ సంఘాల ప్రతినిధులు వనమహోత్సవం సందర్భంగా పాల్గొని మొక్కలు నాటారు. అంతకు ముందు రిజిస్ట్రార్ డా. ఎల్వీకే రెడ్డి ఉద్యోగులతో మొక్కల పరిరక్షణపై ప్రతిజ్ఞ చేయించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





