జంతర్‌ ‌మంతర్‌ ఆం‌దోళనకు ముగింపు

– కేంద్ర మంత్రులతో సీజేపీ ప్రతిధుల చర్చలు ఫలప్రదం
– విద్యార్థులపై దేశవ్యాప్త కేసుల ఎత్తివేతకు అంగీకారం
– భవిష్యత్‌లో ఎలాంటి కేసులతో విద్యార్థులను వేధించమని హామీ
– ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు కోటి పరిహారం డిమాండ్

‌న్యూదిల్లీ, జులై 25: జంతర్‌ ‌మంతర్‌ ఆం‌దోళన ముగిసింది. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ‌రాజీనామా, కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్‌లతో తాజా సమావేశం అనంతరం తమ ఆందోళనను విరమిస్తున్న‌ట్లు కాక్రోచ్‌ ‌జనతా పార్టీ (సీజేపీ) ప్రతినిధులు  ప్రకటించారు. జంతర్‌మంతర్‌ ‌నుంచి విద్యార్థులు, యువత తిరిగి వెళ్లాలని కోరారు. మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ‌రాజీనామాతో తమకు తొలి విజయం దక్కిందన్నారు. నిరసనల సందర్భంగా విద్యార్థులపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లను ఎత్తేసేందుకు కేంద్రం అంగీకరించిందని, నీట్‌ ‌పేపర్‌ ‌లీక్‌ ‌బాధిత కుటుంబాలకు రూ.కోటి పరిహారం ఇవ్వాలన్న డిమాండ్‌కు కేంద్రం సానుకూలంగా స్పందించిందని తెలిపారు. తాము ఆశించిన చర్యలను కేంద్రం త్వరితగతిన తీసుకుంటుందన్న విశ్వాసంతో ఆందోళనను విరమిస్తున్నామన్నారు. ఈ వ్యవహారానికి బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్‌  ‌రాజీనామా చేయాలన్న ప్రధాన డిమాండ్‌ ‌నెరవేరడంతోపాటు, మిగతా వాటినీ నెరవేర్చేందుకు కేంద్రం అంగీకరించిన నేపథ్యంలో నిరసనలు విరమిస్తున్నట్లు సీజేపీ ప్రకటించింది. ధర్మేంద్ర ప్రధాన్‌ ‌రాజీనామా చేసిన అనంతరం కేంద్రంతో సీజేపీ నేతలు మరోసారి చర్చలు జరిపారు. అనంతరం కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్‌తో కలిసి సీజేపీ ప్రతినిధులు డియాతో మాట్లాడారు. నిరసనకారులపై నమోదైన కేసులను కొట్టివేయాలని కేంద్రాన్ని కోరినట్లు తెలిపారు. కేవలం దిల్లీలోనే కాకుండా దేశవ్యాప్తంగా నమోదైన కేసులను కొట్టివేయాలని కోరినట్లు చెప్పారు. నాలుగు రోజుల్లో కేసులు విత్‌‌డ్రా చేస్తామని కేంద్రం హా ఇచ్చింది. భవిష్యత్‌లోనూ కేసులతో వేధించబోమని స్పష్టత ఇచ్చింది. నీట్‌ ‌లీక్‌ ‌వల్ల ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు పరిహారం ఇచ్చేందుకు, విద్యావ్యవస్థలో సమూల మార్పులకు కేంద్రం అంగీకరించిందని తెలిపారు. నిరసనకారులపై పెట్టిన కేసులు ఎత్తివేసేందుకు అంగీకరించినట్లు కేంద్ర మంత్రి జేపీ నడ్డా తెలిపారు. దిల్లీ, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పెట్టిన కేసులను ఎత్తివేస్తామన్నారు. విద్యావ్యవస్థ, పరీక్షల్లో సమూల మార్పులు చేస్తామని ఇప్పటికే చెప్పాం. భవిష్యత్‌లో ఎవరినీ కేసులతో వేధించబోము. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు అండగా ఉంటాం‘ అని జేపీ నడ్డా డియా ఎదుట హా ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆందోళన విరమిస్తున్నట్లు సీజేపీ ప్రతినిధులు ప్రకటించారు. ఆందోళనకారులు క్షేమంగా ఇళ్లకు చేరుకోవాలని కోరారు. సీజేపీ ప్రతినిధులతో కలిసి డియా సమావేశంలో పాల్గొన్న కేంద్ర మంత్రి జేపీ నడ్డా వారితో సుదీర్ఘంగా చర్చించామని అన్నారు. నీట్‌ ఆం‌దోళనల్లో పాల్గొన్న విద్యార్థులపై కేసులు ఎత్తేస్తామని చెప్పారు. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులకు నిబంధనలకు లోబడి పరిహారం ఇస్తామని చెప్పారు. కేంద్ర మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్‌ ‌రాజీనామాపై చేయడంపై సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్‌ ‌దీప్కే స్పందించారు. జంతర్‌ ‌మంతర్‌ ‌వేదికగా ఆయన మాట్లాడుతూ బొద్దింకల సత్తా అందరికీ తెలిసొచ్చిందని అన్నారు. నీట్‌ ‌పేపర్‌ ‌లీక్‌ ‌బాధితులకు న్యాయం దక్కిందని వ్యాఖ్యానించారు. బొద్దింకలు ఒకసారి వస్తే వెళ్లగొట్టడం సాధ్యం కాదని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఇది విద్యార్థుల విజయమని అన్నారు. తమని తాము బాద్షాలుగా భావిస్తున్న వారిని దారిలోకి తేవాల్సిన అవసరం ఉందని అన్నారు. యువత వోట్లతోనే వారు నేడు అధికారంలో ఉన్నారని అన్నారు. ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. పాలకులను అదుపులో ఉంచాల్సిన అవసరం ఉందని కూడా ఉన్నారు. తాము పెట్టిన రెండు డిమాండ్స్ ఇం‌కా మిగిలే ఉన్నాయని దీప్కే అన్నారు. అవి సాధించేవరకూ ముందుకు సాగుతూనే ఉంటామని అన్నారు.
——–
ధర్మేంద్ర రాజీనామాపై వాంగ్‌చుక్‌ ‌హర్షం

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ‌రాజీనామాపై సామాజిక కార్యకర్త సోనమ్‌ ‌వాంగ్‌చుక్‌ ‌హర్షం వ్యక్తం చేశారు. ఇది పట్టుదలతో యువత సాధించిన విజయని పేర్కొన్నారు. జెన్‌-‌జీ, సీజేపీ ప్రతినిధులకు అభినందనలు తెలియజేశారు. ఈ మేరకు తన ఎక్స్ ‌ఖాతాలో శనివారం ఓ పోస్టు పెట్టారు. ఆ పోస్టులో.. ఇది ప్రజాస్వామ్యం సాధించిన విజయం. ఇది శాంతి, ఓర్పు, నిరంతర పట్టుదలల విజయం. దేశంలోని సీజేపీ, జెన్‌ ‌జీ యువతకు అభినందనలు. భయాన్ని వీడి దేశం నలుమూలల నుంచి పోరాటానికి కదలివచ్చిన పౌరులందరికీ ధన్యవాదాలు. ఇప్పటివరకు బాధ్యతాయుతమైన సమాధానం కోరాం. ఇకపై సంస్కరణల వైపు సాగుదాం’ అని రాసుకొచ్చారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *