Take a fresh look at your lifestyle.

ఎన్‌ ‌కౌంటర్‌

సాధించే క్రమంలో అతను
మాత్రం అమరుడయ్యాడు!
అంకురుంచిన ఆశయం
అమృతం త్రాగిందేమో
అది అలాగే ఉంది!

ఆవేశాన్ని త్రుంచారే కానీ
అగ్గి రాసిన ఆక్రోశాన్ని ఆర్పలేదు!
అసంతృప్తిని పెంచారే కానీ
విరిపూసిన ఆనందాన్ని పంచలేదు!

లాగేసుకున్న హక్కులను,
గుంజేసుకున్న స్వేచ్ఛలను,
తిరిగి తెస్తానని!

అణగారిన వర్గాల్లో
అరుణోదయ కాంతుల్ని
మరలి ఇస్తానని!
బందూకే ఆయుధమని
పోరాటమే శరణ్యమని!

చీకటి తొలగాలంటే
చీకట్లోనే శోధించాలని!
వెలుగులు పూయాలంటే
విప్లవ జ్యోతిగా మారాలని!

సమతను సాధించే క్రమంలో
సమిధగా మారినా
సమాధిలో చేరినా!
సంతోషమేనని
ఆరాట పడ్డాడు!
అడవి బాట పట్టాడు!

మెచ్చిన నమ్మకాన్ని
నచ్చిన సిద్దాంతాన్ని మోస్తూ !
ఎదురుపడ్డ ప్రమాదంలో
ఎగసిపోయాడు!

వీరుడో…అమరుడో
విజయుడో…విఫలుడో!
లోకమే కథను విప్పాలి!
కాలమే తీర్పు ఇవ్వాలి!

– ఉషారం
9553875577

Leave a Reply