తెలంగాణ అస్తిత్వ వేదిక ఆవిర్భావం

– 19న‌ రవీంద్రభారతిలో సమావేశం

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 17: విశాల తెలంగాణ ప్రజానీకాన్ని మమేకం చేస్తూ అస్తిత్వ పరిరక్షణకు ఒక సమగ్ర వేదికగా ‘తెలంగాణ అస్తిత్వ వేదిక’ రూపుదిద్దుకుందని వేదిక నిర్వాహకులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆవిర్భావ సమావేశం ఆదివారం ఉదయం 10 గంటలకు హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. మూడు నెలలుగా ఆన్‌లైన్ జూమ్ సదస్సుల ద్వారా చర్చించిన అంశాలను సంకలనం చేసి, ‘తెలంగాణ అస్తిత్వం’ అనే వ్యాస సంకలనాన్ని ఈ వేదికపై ఆవిష్కరిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా,వరంగల్ జిల్లా కమలాపూర్ మండల కేంద్రానికి చెందిన. ఆరు దశాబ్దాలుగా జాతీయ-అంతర్జాతీయ స్థాయిలో జర్నలిజం రంగంలో అక్షరతపస్విగా నిలిచిన ఎస్.వెంకట్ నారాయణకు జీవన సాఫల్య సాధన అవార్డును డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ వైస్-ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి అందజేస్తారన్నారు. తెలంగాణ ఆత్మను మేల్కొలిపే ఈ ఉద్యమానికి ప్రతి తెలంగాణవాసి తన వంతు సహకారం అందించి ఈ అస్తిత్వ పరిరక్షణ యజ్ఞంలో భాగస్వామి కావాలని వేదిక చైర్మన్ వీరమల్ల ప్రకాశ్, కన్వీనర్ శ్రీధర్ దేశ్ పాండే, కో ఆర్డినేటర్ పిట్టల రవీందర్ పిలుపునిచ్చారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *