రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా మరోమారు హరివంశ్

న్యూదిల్లీ, ఏప్రిల్ 17: రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా హరివంశ్ నారాయణ్ సింగ్ ఎన్నికయ్యారు. ప్రతిపక్ష అభ్యర్థులు ఎవరూ నామినేషన్ దాఖలు చేయకపోవడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. ఆయన ఉపసభాపతి బాధ్యతలు చేపట్టడం ఇది మూడోసారి. ఈ సందర్భంగా ప్రధాని మోదీ డిప్యూటీ చైర్మన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన అనుభవం రాజ్యసభకు ఎంతో అవసరమని అన్నారు. ఆయన అందరినీ కలుపుకుని వెళ్తారని ఆశిస్తున్నానన్నారు. హరివంశ్ నేతృత్వంలో సభ మరింత శక్తిమంతం అవుతుందని అన్నారు. రాజ్యసభలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా నూతన ఉప సభాపతికి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ప్రతిపక్షానికి కూడా తగిన ప్రాధాన్యం ఇస్తారని ఆశిస్తున్నట్టు తెలిపారు. ఆయన అందరివాడని అన్నారు. ఇటీవల ఆయన రాజ్యసభ పదవీకాలం ముగిసింది. దీంతో ఆయనను రాష్ట్రపతి కోటాలో నామినేట్ చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *