ఫాల్కన్‌ ‌గ్రూప్‌ ‌సీఎండీ అమర్‌దీప్‌ అరెస్ట్ ‌

– 14రోజుల రిమాండ్‌ ‌విధించిన కోర్టు

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూలై18: ఫాల్కన్‌ ‌గ్రూప్‌కు సంబంధించిన మనీలాండరింగ్‌ ‌కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఫాల్కన్‌ ‌సీఎండీ అమర్‌దీప్‌ ‌కుమార్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ‌డైరెక్టరేట్‌ అధికారులు అరెస్ట్ ‌చేశారు. దిల్లీలోని తీహార్‌ ‌జైలు నుంచి హైదరాబాద్‌కు తీసుకొచ్చి అమర్‌దీప్‌ అరెస్ట్‌ను చూపించారు. అనంతరం న్యాయస్థానంలో హాజరుపరచగా కోర్టు ఆయనకు 14 రోజుల జ్యుడీషియల్‌ ‌రిమాండ్‌ ‌విధించింది. దీంతో అధికారులు అమర్‌దీప్‌ను చర్లపల్లి సెంట్రల్‌ ‌జైలుకు తరలించారు. ఫాల్కన్‌ ‌సంస్థ.. పెట్టుబడిదారులకు 11 శాతం నుంచి 21 శాతం వరకు అధిక లాభాలు ఇస్తామని హామీ ఇచ్చి భారీగా నిధులు సమీకరించినట్లు ఈడీ గుర్తించింది. మొత్తం రూ.4,215 కోట్ల మేర పెట్టుబడులు సేకరించినట్లు వెల్లడించింది. కొత్త పెట్టుబడిదారుల నుంచి వచ్చిన డబ్బుతో పాత పెట్టుబడిదారులకు చెల్లింపులు చేసినట్లు దర్యాప్తులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ‌డైరెక్టరేట్‌ ‌గుర్తించింది. ఈ వ్యవహారంలో ఇప్పటివరకు రూ.792 కోట్లను నేర ఆదాయంగా గుర్తించినట్లు తెలిపింది. ఇప్పటికే ఈ కేసులో రంగారెడ్డి జిల్లాలోని ఆస్తులతో పాటు హాకర్‌ 800ం ‌విమానం సహా రూ.20.6 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ తాత్కాలికంగా జప్తు చేసింది. విచారణకు సహకరించకపోవడంతో సెక్షన్‌-19 ‌కింద అమర్‌దీప్‌ ‌కుమార్‌ను ఈడీ అరెస్ట్ ‌చేసింది. ఫాల్కన్‌ ‌మనీలాండరింగ్‌ ‌కేసులో నిధుల మళ్లింపు, ఇతర నిందితుల పాత్రపైనా ఈడీ దర్యాప్తు కొనసాగుతోంది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *