– ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రారంభం
వరంగల్, ప్రజాతంత్ర, జూలై 18 : వరంగల్‌లోని కిట్స్ డబ్ల్యు కళాశాలకు బి.టెక్‌లో సీఎస్‌సీ-సీఎసఈ(సైబర్ సెక్యూరిటీ), బి.టెక్. ఈసీవీ-ఈసీఈ( వీఎల్‌ఎస్‌ఐ) డిజైన్ అండ్ టెక్నాలజీ కోర్సులతోపాటు బి.టెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (డేటా సైన్స్)లో అదనపు సెక్షన్లు మంజూరయ్యాయి. కళాశాలలో శనివారం జరిగిన కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె.అశోక రెడ్డి మాట్లాడుతూ కొత్త ప్రోగ్రామ్‌లకు న్యూదిల్లీలోని ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ), రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపాయని, దీనివల్ల 2026-27 విద్యా సంవత్సరం నుండి ఈ కోర్సులను ప్రారంభించే అవకాశం లభించిందని చెప్పారు. కిట్స్ అదనపు కార్యదర్శి వొడితల సతీష్ కుమార్ మాట్లాడుతూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ), డిజిటల్ సాంకేతికతల యుగంలో సైబర్ సెక్యూరిటీ (సీఎస్‌సీ), వీఎల్‌ఎస్‌ఐ (ఈసీవీ), డేటా సైన్స్(సీఎస్‌డీ) వంటి రంగాలు అత్యంత ఆదరణ పొందుతున్నాయన్నారు..ప్రపంచ సాంకేతిక రంగంలో పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా విద్యార్థులకు పరిశ్రమకు అవసరమైన నైపుణ్యాలను అందించడం ద్వారా, ఈ నూతన రంగాలు అద్భుతమైన కెరీర్ అవకాశాలను, మెరుగైన ఉపాధి అవకాశాలను కల్పిస్తాయని వక్కాణించారు. భవిష్యత్ పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా నాణ్యమైన సాంకేతిక విద్యను అందించడంలోనూ, అత్యాధునిక సాంకేతిక రంగాలలో విజయవంతమైన కెరీర్ కోసం విద్యార్థులను సిద్ధం చేయడంలోనూ కిట్స్‌కు ఉన్న నిబద్ధతను ఈ కొత్త పోగ్రామ్‌లు ప్రవేశపెట్టడం ప్రతిబింబిస్తుందని సతీష్ చెప్పారు. కిట్స్‌డబ్ల్యూ చైర్మన్ కెప్టెన్ వి.లక్ష్మీకాంతరావు, యాజమాన్య సభ్యులు, కోశాధికారి పి.నారాయణరెడ్డి కొత్త కోర్సులను ప్రవేశపెట్టినందుకు అధ్యాపక బృందాన్ని అభినందించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం.కోమల్ రెడ్డి, డీన్లు, విభాగాల·అధిపతులు,రసాయన శాస్త్ర అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ డి.ప్రభాకరాచారి, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.
—————————————————————————————————————————————————————-
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





