ఒంటరి దివ్యాంగురాలిపై లైంగిక దాడి

– దుండగుడి కోసం పోలీసుల గాలింపు

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూన్‌ 24:‌ నగరంలోని ఎల్బీనగర్‌ ‌పోలీస్‌ ‌స్టేషన్‌ ‌పరిధిలో దారుణ ఘటన వెలుగుచూసింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న దివ్యాంగురాలిపై ఓ దుర్మార్గుడు అత్యాచారానికి ఒడిగట్టాడు. బాధితురాలికి మాట్లాడే, వినికిడి శక్తి లేకపోవడాన్ని ఆసరాగా చేసుకుని ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మహిళ మెడ, చేతులకు స్వల్ప గాయాలయ్యాయి. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న ఎల్బీనగర్‌ ‌పోలీసులు రంగంలోకి దిగారు. బాధితురాలిని చికిత్స నిమిత్తం హాస్పిటల్‌ కు తరలించారు. నిందితుడిని పట్టుకునేందుకు ఆ ప్రాంతంలోని సీసీ టీవీ దృశ్యాలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. సీసీ ఫుటేజి ఆధారంగా దర్యాప్తును ముమ్మరం చేశామని, త్వరలోనే నిందితుడిని అదుపులోకి తీసుకుంటామని తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *