ప్రత్యామ్నాయ మార్గాల్లో తాగునీటి సరఫరా

– చెంచుపెంటల్లో తాగునీటి సరఫరాపై మంత్రి సీతక్క సమీక్ష

హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 10 : చెంచుపెంటల్లో తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అధికారులను ఆదేశించారు. నల్లమల అటవీ ప్రాంతంలోని చెంచుపెంటల్లో తాగునీటి సరఫరాపై అసెంబ్లీలోని తన చాంబర్‌లో గురువారం సమీక్ష నిర్వహించారు. చెంచుపెంటలకు మంచినీటి సరఫరాపై అధికారులు మంత్రికి వివరాలు అందజేశారు. నల్లమల అడవుల్లో కేంద్ర పర్యావరణ చట్టాల కారణంగా విద్యుత్ అనుమతులు పొందడంలో ఇబ్బందులు ఉండటంతో మిషన్ భగీరథ నీటిని పంపింగ్ చేయడంలో సమస్యలు ఎదురవుతున్నాయని తెలిపారు. అయినప్పటికీ ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా అన్ని తాగునీటి సరఫరా జరుగుతోందని వివరించారు. ప్రతి చెంచుపెంటలో పర్యటించి అక్కడి తాగునీటి పరిస్థితిపై సమగ్ర నివేదిక సమర్పించాలని మంత్రి అధికారులకు సూచించారు. సమీక్షలో మిషన్ భగీరథ చీఫ్ ఇంజనీర్ జి.లలిత, సూపరింటెండెంట్ ఇంజనీర్ హెచ్. జగన్మోహన్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె.విజయసీ, అసిస్టెంట్ ఇంజనీర్లు ఈ. సందీప్, ఎస్‌కే. అక్బర్ పాషా పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *