ఓటమి వచ్చినప్పుడు ఆగిపోవద్దు

– అదే విజయానికి కొత్త ప్రారంభం

ప‌రీక్ష‌ల ఫ‌లితాల‌ను తల్లిదండ్రులు, విద్యార్థులు ప్రెస్టీజ్ గా తీసుకొని మానసిక ఆందోళ నలకు గురవుతున్నారు. తల్లిదండ్రులు విద్యార్థులూ ఆలోచించండి.

తమ పిల్లలకు మంచి జీవితం ఇవ్వాలని ఆశించేది తల్లిదండ్రులే..! బుడిబుడి అడుగుల నుంచి కంటికి రెప్పలా చూసుకుంటూ పిల్లవాడి బంగారు భవిష్యత్తుకు బాటలు సుగమం చేసేది తల్లిదండ్రులే..! పిల్లలకు చిన్న దెబ్బ తగిలినా తమకే తగిలినట్టు విలవిల్లాడేది తల్లిదండ్రులే..! మరి పిల్లలు చేస్తున్నది ఏంటి? ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే కన్నవారికి దైర్యంగా ఉండాల్సిన తరుణంలో తల్లిదండ్రులకు మానసిక క్షోభకు గురి చేస్తున్నారు. తల్లిదండ్రులు కూడా వారిపై మార్కుల ఒత్తిళ్లు తేవడం సమంజసమేనా? కొద్దిగా ఆలోచించండి.

ఇతరులతో పోల్చడం పిల్లల మనసును గాయ పరుస్తుంది

ప్రతి విద్యార్థి ప్రత్యేకమే. విద్యార్థి దశలో పరీక్షలు సాధారణమే అయినప్పటికీ జీవన ప్రయాణంలో విద్యార్థి ఒక గమ్యాన్ని ఎంచుకోవడంలో ఈ ఫలితాలు కొంత మేర దోహదం చేస్తాయని గుర్తించాలి, పరీక్ష ఫలితాల ఆధారంగా లక్ష్య నిర్దారణ చేసుకోవాలి. ప్రతి విద్యార్థి ప్ర తనలో ఉన్న నైపుణ్యాలు తన తోటి విద్యార్థులలో ఉండొచ్చు, ఉండక పోవచ్చు. ఎట్టి పరిస్తితులలో ఇతరులతో పోల్చుకోవడం సరికాదు. పరీక్షలో తక్కువ మార్కులు వచ్చాయనో, అనుత్తీర్ణుల య్యామనో బాధ పడొద్దు. మార్కులు ర్యాంకులే ప్రధానం కాదు. ప్రపంచంలో లక్ష్యాలేన్నో ఉన్నాయి అందులో మనమూ ఒకటి సాధిద్దాం. ఒక సమిధలా వెలుగుదాం. ప్రపంచానికి ఒక వెలుగును ప్రసాదిద్దాం. గెలుపునకు తుదిమెట్టు అంటూ ఏది ఉండదు, ఓటమి అన్నది ఎప్పుడు అపాయకారి కాదు. మనకు ఈ రెంటిని సాధించాల్సిన దానికి కావాల్సింది మనో దైర్ఘ్యం, ఆత్మ విశ్వాసం, పట్టుదల.

ఫలితాలు కాదు… భవిష్యత్తే ముఖ్యం

విద్యార్థుల ప్రతిభకు మార్కులు కొలమానం కానే కాదు. మార్కుల ఆధారంగా వారి తెలివితేటలను కొలవకూడదు. ప్రపంచంలోని మేధావులంతా మార్కు లేమీ సాధించిన వారుకాదు. పిల్లల చదువులను, మార్కులను తల్లిదండ్రులు వంశ ప్రతిష్టగా భావిస్తుం టారు. ఇది తప్పు. విద్యాసంస్థల యాజమాన్యాలు మార్కుల కోసం పిల్లలపై ఒత్తిడి పెట్టకూడదు.

పిల్లలకు ధైర్యం చెప్పాల్సిన సమయం ఇది

ఫలితాల ప్రకటనతో వచ్చిన మార్కులతో ఎవరూ అధైర్యప డకూడదని, నిరుత్సా హానికి గురికావద్దని, తాము అండగా ఉన్నామని తల్లిదడ్రులు పిల్లలకు, ఉపాధ్యాయులు విద్యా ర్థులకు భరోసా ఇవ్వాలి. తల్లిదండ్రులు తమ పిల్లల గురించి అత్యధిక అంచనాలను కలిగి ఉండకూడదని, పిల్లల వాస్తవిక స్థాయిని తల్లిదండ్రులు భరోసా ఇవ్వాలి.

చులకనగా చేసిన సమాజం ముందే తలెత్తుకొని జీవించాలి

ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ అయినప్పటికీ విద్యార్థులకు మరో అవకాశం ఉంటుంది. సప్లిమెంటరీలు రాసి మళ్లీ పాస్ కావచ్చు. గత పరీక్షల్లో చేసిన పొరపాట్లను సరిదిద్దుకొని ఉన్నత విద్యను అభ్యసించవచ్చు. చులకనగా చేసిన సమాజం ముందే తలెత్తుకొని జీవించవచ్చు. కానీ ఇదేమీ ఆలోచించకుండా క్షణికావేశంలో విద్యార్థులు మనోవేదనకు లోనవుతున్నారు. పరీక్ష తప్పానని, ర్యాంకులు రాలేదని, ఎక్కువ మార్కులు తెచ్చుకోలేదని, విద్యాపరమైన ఒత్తిళ్లు ఎక్కువయ్యాయి అనేది అక్షర సత్యం.

ఓటమి తాత్కాలికం.. జీవితం అమూల్యం

తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల స్నేహ భావంతో ఉండాలి. పరుష పదజాలంతో దూషించ “కూడదు. పిల్లల స్నేహాలు, విద్యాలయాలలో వారి ప్రవర్తన, చదువు తీరునూ పరిశీలిస్తుండాలి. చదువు తమ వంశ ప్రతిష్ట అంటూ గర్వాలకు పోకుండా పిల్లల పట్ల సానుకూలంగా ఉం డాలి. మార్కులే ధ్యేయ oగా పెంచ కూడదు. 90% మార్కులు వచ్చిన ఎంత వారు ప్రతిభా వంతులో 40% మా ర్కులు వచ్చిన వారు కూడా అంతే ప్రతిభావంతులనే చిన్న విషయాన్ని పిల్లలకు అర్థం చేయించాలి. ఒకసారి పరీక్షలో తప్పితేనే జీవితం నష్టం పోదనే భరోసా ఇవ్వాలి. మళ్లీ చదివి పాస్ కావచ్చనే ధైర్యం ఇవ్వాలి. ఇంటర్లో ఫెయిలైన విద్యా ర్థులను తిట్టకుండా, వేధించకుండా సముదాయించాలీ, తిరిగి పాసయ్యేలా ప్రోత్సహించాలి. విద్యార్థులు ప్రతి విషయానికి క్షణికావేశానికి లోనుకాకూడదు. మీ సమస్యను స్నేహితులు, తల్లిదండ్రులు, సన్నిహితంగా ఉండే ఉపాధ్యాయులతో చర్చించాలి. ఏ విషయమైనా తల్లిదండ్రులతో చర్చించాలి. మన ఉజ్వల భవిశ్యత్తును కోరుకునేది తల్లిదండ్రులే.

మార్కులు కాదు.. విజ్ఞానం ముఖ్యం

విద్యార్థులకు మార్కులు కాదు.. విజ్ఞానం ముఖ్యమనే విషయాన్ని తల్లిదండ్రులు గ్రహించాలి. తల్లిదండ్రులు పిల్లలపై ఒత్తిడి పెంచకూడదు. పిల్లలపై ఫలితాలు వచ్చే సమయంలో ఓ కన్నేసి ఉంచాలి. అధ్యాపకులు కూడా మార్కులు తక్కువగా వచ్చే విద్యార్థులను చిన్నచూపు చూడకూడదు. మార్కులు తక్కువ వచ్చినా, ఫెయిల్ అయినా విద్యార్థులు డిప్రెషన్కు గురి కాకూడదు. ప్రపంచంలోని మేధావులంతా మార్కులేమీ సాధించిన వారుకాదు విద్యార్థుల ప్రతిభకు మా ర్కులు కొలమా నం కానే కాదు. మార్కుల ఆధారంగా వారి తెలివితేటలను కొలవకూడదు. ప్రపంచంలోని మేధావులంతా మార్కు లేమీ సాధించిన వారుకాదు. పిల్లల చదువులను, మార్కులను తల్లిదండ్రులు వంశ ప్రతిష్టగా భావిస్తుం టారు. ఇది తప్పు. విద్యాసంస్థల యాజమాన్యాలు మార్కుల కోసం పిల్లలపై ఒత్తిడి పెట్ట కూడదు.

విజయానికి అసలు బలం ఆత్మవిశ్వాసం, పట్టుదల
విద్యార్థులు అదైర్య పడకూడదు. విద్యార్థులు అదైర్య పడితే తల్లిదండ్రులకు బాధ కలిగించిన వాళ్లవుతారు. మా ర్కులే జీవితానికి ప్రాతిపదకన కాదు. జీవితాన్ని నడిపించేది సాధించాలనే కసి. పట్టుదల. ఆత్మవిశ్వాసం. ఇవీ కలిగిన వ్యక్తులే ముందుకు వెళ్తారు. ఏదైనా సాధిస్తారు. ప్రపంచ విజేతలుగా నిలుస్తారు.

డాక్ట‌ర్‌ అట్ల శ్రీనివాస్ రెడ్డి, సైకాలజిస్ట్, 
   ఫ్యామిలీ రిహాబిలిటేషన్ కౌన్సెలర్,
   9703935321.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *