వ‌ర్షాభావ ప‌రిస్థితుల‌పై 20న జిల్లాస్థాయి స‌మావేశాలు

– ఏర్పాట్లు చేయాల‌ని అధికారుల‌కు సీఎస్ ఆదేశాలు

హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, జూలై 18: రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, ఎల్-నినో ప్రభావం, తీసుకోవాల్సిన కార్యాచరణపై జిల్లా కలెక్టర్లు, ప్రత్యేక అధికారులతో ప్ర‌భుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శనివారం సమీక్షించారు. రాష్ట్రంలోని పది ఉమ్మడి జిల్లాల్లో ప్రసుత్త పరిస్థితులపై ఆయా జిల్లాల ఇన్‌చార్జి మంత్రులు జిల్లాల్లో పర్యటించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమీక్షిస్తార‌న్నారు. ఈ నెల 20న నిర్వహించనున్న ఆ జిల్లా స్థాయి సమావేశాలకు నియమితులైన ప్రత్యేక అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని సీఎస్ ఆదేశించారు. ఎల్-నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులు వ్యవసాయంపై చూపే ప్రభావం గురించి రైతులు, ప్రజాప్రతినిధులు, వారికి విస్తృత అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమన్నారు. అధిక శాతం జిల్లాల్లో ఇప్పటికే తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయంటూ రైతులకు ప్రత్యామ్నాయ పంటల సాగు, పరిస్థితులకు అనుగుణమైన వ్యవసాయ విధానాలు, అత్యవసర ప్రత్యామ్నాయ ప్రణాళికలపై అవగాహన కల్పించాలని కలెక్టర్లను ఆదేశించారు. పంటల వైవిధ్యీకరణ ద్వారా రైతులు నష్టాలను తగ్గించుకుని జీవనోపాధిని కాపాడుకోవచ్చని సూచించారు. రైతులకు శాస్త్రీయ, సాంకేతిక సమాచారాన్ని సమర్థవంతంగా చేరవేసే విధంగా ఈ కార్యక్రమాన్ని రోజంతా నిర్వహించేలా రూపొందించినట్లు సీఎస్ తెలిపారు. ఈ సమావేశాల్లో రైతులు వ్యవసాయ శాస్త్రవేత్తలు, నిపుణులు, ప్రభుత్వ అధికారులతో నేరుగా చర్చించి తమ సందేహాలను నివృత్తి చేసుకోవడంతో పాటు ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల ప్రణాళిక, వ్యవసాయ నిర్వహణపై సరైన నిర్ణయాలు తీసుకునే అవకాశం కల్పించనున్నట్లు చెప్పారు.ఈ కాన్ఫరెన్స్‌లో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు వికాస్ రాజ్, దానకిశోర్, నవీన్ మిట్టల్, బెన్‌హర్ ఎక్కా, వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్‌, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *