మెరుగైన పనితీరు కనబరచాలి

– ఎల్‌నినో ఎదుర్కొనేందుకు సమన్వయంతో పనిచేయాలి
– సీఈవోలు, డిప్యూటీ సీఈవోల అసోసియేషన్ కు మంత్రి సీతక్క సూచ‌న‌

హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 14: అధికారులు తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ మెరుగైన పనితీరుతో శాఖకు మంచి పేరు తేవాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క ఆకాంక్షించారు. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో కీలక పాత్ర పోషించాలని సూచించారు. జిల్లా సీఈవోలు, డిప్యూటీ సీఈవోల అసోసియేషన్ నూతన కార్యవర్గం ప్రజాభవన్‌లో బుధవారం మంత్రి సీతక్కను మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా మంత్రి సీతక్కను అసోసియేషన్ ప్రతినిధులు శాలువాతో సత్కరించి తమ కృతజ్ఞతలు తెలపగా మంత్రి సీతక్క నూతన కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ముఖ్యంగా ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడే వాతావరణ పరిస్థితులు, వాటి వల్ల తలెత్తే సవాళ్లను ఎదుర్కొనేందుకు అధికారులు ముందస్తు ప్రణాళికతో పనిచేయాలని మంత్రి సూచించారు. పరిస్థితులకు అనుగుణంగా అవసరమైన చర్యలు చేపడుతూ, క్షేత్రస్థాయిలో సమన్వయంతో వ్యవహరించాలన్నారు. సీఈవోలు, డిప్యూటీ సీఈవోలు, డీఆర్‌డీవోలు ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అప్రమత్తంగా ఉండాలని, విధి నిర్వహణలో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ ప్రజల అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ప్రభుత్వ కార్యక్రమాల అమలులో అధికారులు చొరవ చూపాలని, ప్రజలకు ప్రయోజనం చేకూర్చేలా కష్టపడి పనిచేయాలని మంత్రి సీతక్క ఆకాంక్షించారు. సమర్థవంతమైన పనితీరు, అంకితభావం, సమన్వయంతోనే శాఖ లక్ష్యాలను సాధించగలమన్నారు. శాఖ అభివృద్ధికి, ప్రభుత్వ కార్యక్రమాల విజయవంతమైన అమలుకు తమ వంతు కృషి చేస్తామని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు.మంత్రి సీతక్కను కలిసిన వారిలో టీజీవో అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావుతోపాటు అసోసియేషన్ అధ్యక్షుడు ప్రేమ్‌కరణ్ రెడ్డి, జనరల్ సెక్రటరీ శ్రీనివాస్, అసోసియేట్ ప్రెసిడెంట్ నర్సింహ, ట్రెజరర్ నవీన్, వైస్ ప్రెసిడెంట్లు ప్రవీణ్, సబిత, ఆర్గనైజింగ్ సెక్రటరీ వెంకయ్య తదితర కార్యవర్గ సభ్యులు ఉన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *