‌గురువులకు ఎగనామం!

హైదరాబాద్‌: ‌దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా అధ్యాపకుల సమ్మెతో యూనివర్సిటీలు, కాలేజీలు మూతపడ్డాయి. ఐదో వేతన సంఘం సిఫార్సులకు అనుగుణం గా తమ జీత భత్యాలు, సర్వీసు నిబంధనలను సవరించనందుకు నిరసనగా అధ్యాపకులు దేశ వ్యాప్తంగా సమ్మెకు దిగారు. ఆగస్టు 11 నుంచి మొదలైన సమ్మె 27 నుంచి ఊపందుకుంది. అడ్మిషన్లు, పరీక్షలు ఎక్కడి వక్కడ ఆగిపోయాయి. తరగతి గదులకు తాళాలు పడ్డాయి. పాఠాలు చెప్పాల్సిన పంతుళ్లు సమ్మెకు దిగడం తో దేశ వ్యాప్తంగా 228 విశ్వవిద్యాలయాలు, వేలాది డిగ్రీ కాలేజీలు మూత పడ్డాయి. ఒక రకంగా ఉన్నత విద్యారంగం స్తంభించి పోయింది. ఫలితంగా 60 లక్షలకు పైగా విద్యార్థులు ఇప్పటికే దాదాపు నెలరోజుల తమ విలువైన కాలాన్ని నష్టపోయారు. విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న అధ్యాపకుల వేతనాలను సవరిస్తూ గత జూలై 27వ తేదీన కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ జారీచేసిన ఉత్తర్వుల పట్ల అధ్యాపక వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఐదో వేతన సంఘం సిఫార్సులకు అనుగుణంగా ప్రభుత్వం ప్రకటించిన కొత్త వేతనాలు తమకు ఆమోదయోగ్యంగా లేవని దేశవ్యాప్తంగా ఉన్న అన్ని అధ్యాపక సంఘాలు ప్రకటించాయి. ఈ కొత్త జీత భత్యాలు తమను, తమ వృత్తిని కించపరిచే విధంగా వున్నాయంటూ ఈ సంఘాలు సమ్మెకు పిలుపు నిచ్చాయి. దీంతో కేంద్ర, రాష్ట్ర విశ్వవిద్యాలయాలతో పాటు, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, ఎయిడెడ్‌ ‌కళాశాలల్లో బోధన నిలిచిపోయింది. తరగతుల బహిష్క రణ, ధర్నాలు, నిరాహార దీక్షలతో ఆందోళన ఊపందుకుంది.
ఎందుకీ సమ్మె?! సాధారణంగా ప్రొఫెసర్లు, లెక్చరర్లు, పరిశోధకులు అంటే సంఘంలో ఒక గుర్తింపు గౌరవం వుంది. ముఖ్యంగా మన దేశంలో ‘గురువు’ కు ఒక ప్రత్యేక స్థానం వుంది. విశ్వవిద్యాలయాల్లో, పరిశోధనా సంస్థల్లో పనిచేసే అధ్యాపకులు, పరిశోధకులు కూడా ఆ హోదాను, గౌరవాన్ని అలా కాపాడుకోవడానికే ప్రయత్నిస్తుంటారు. అధ్యాపక వృత్తి అనేది గౌరవ ప్రదమైందనీ, క్రమశిక్షణకు మారుపేరనీ, మరోటనీ అనుకుంటారు. సమ్మెలు, ధర్నాల పేరుతో రోడ్ల మీదికి రావడానికి, ఆందోళనలకు దిగడానికి అధ్యాపకులు అంతగా యిష్టపడరు. నిజానికి సాధారణ కార్మికుల్లో వుండే ఏకాభిప్రాయం, పట్టుదల కూడా అధ్యాపకుల్లో వుండదు. అయినా సమ్మె విజయవంతమైంది. ‘సమ్మె’ లకు కాలం చెల్లిందనుకుంటున్న నేపధ్యంలో అధ్యాపకుల సమ్మె దేశ వ్యాప్తంగా ‘ప్రభావం’ చూపడం ఆశ్చర్య పరిచింది. అయితే అందులో ఆశ్చర్య పడాల్సిందేమీ లేదని, ఇది టీచర్ల అస్థిత్వానికి సంబంధించిన సమస్య అయినందువల్లే అందరూ కలిసికట్టుగా సమ్మెను విజయవంతం చేశారని ఆంధ్రప్రదేశ్‌ ‌విశ్వవిద్యాలయాల అధ్యాపక సంఘాల సమాఖ్య (ఎపిఫుటా) ప్రధాన కార్యదర్శి ప్రొఫెసర్‌ ‌పిఎల్‌ ‌విశ్వేశ్వర్‌ ‌రావు అన్నారు. ‘అధ్యాపకులు కేవలం జీతాల కోసం సమ్మెకు దిగారన్న’ విమర్శను ఆయన కొట్టి పారేశారు. ‘మాకు జీతం డబ్బువొక్కటే సమస్య కాదు మొత్తం అధ్యాపక వృత్తే ప్రశ్నార్థకం కాబోతోంది. మా గౌరవాన్ని నిలబెట్టుకోవడం కోసమే ఈ పోరాటానికి దిగాం’ అని ఆయన పేర్కొన్నారు.
విశ్వ విద్యాలయాల గ్రాంట్ల సంఘం (యుజిసి) సిఫార్సుల మేరకు కేంద్ర ప్రభుత్వం విశ్వవిద్యాలయాల్లో, అనుబంధ కాలేజీల్లో పనిచేసే అధ్యాపకుల జీత భత్యాలు సవరిస్తుంది. ఉన్నత విద్యా సంస్థలు విశ్వవిద్యా లయాలు, పరిశోధనా సంస్థల కార్యకలాపాల పర్యవేక్షణ కోసం 1956లో పార్లమెంటు చట్టం ద్వారా ఏర్పాటైన యుజిసి అప్పటి నుంచి విద్యా విధానాలతో పాటు విద్యా సంస్థల్లో పనిచేసే అధ్యాపకుల జీత భత్యాలు కూడా నిర్థారిస్తోంది. ఈ జీతాలను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీత భత్యాలతో పాటుగా ప్రతి పదేళ్లకోసారి సమీక్షిస్తారు. అధ్యాపకుల జీతాలు కేంద్ర ప్రభుత్వ సర్వీసులోని గ్రూప్‌ ఎ అధికారుల జీత భత్యాలతో సమానంగా ఉండే విధంగా చూస్తారు. అయితే ఈ సారి అలా జరుగలేదని, వేతనాలు, పదోన్నతుల విషయంలో అధ్యాపకులకు తీవ్ర అన్యాయం జరుగనుందని అధ్యాపక సంఘాలు అంటున్నాయి. 1996 జనవరి 1వ తేదీ నుంచి పెరగవలసి వున్న అధ్యాపకుల జీతభత్యాల నిర్థారణ కోసం యుజిసి 1994 ఆగస్టులో పదిమంది సభ్యులతో కూడిన ఒక కమిటీని నియమించింది. బెనారస్‌ ‌హిందూ విశ్వ విద్యాలయం మాజీ వైస్‌ ‌ఛాన్సలర్‌ ‌ప్రొఫెసర్‌ ఆర్‌.‌పి.రస్తోగీ నేతృత్వంలో ఏర్పాటైన ఈ కమిటీ 1997 మే 28న తన నివేదికను యుజిసికి సమర్పించింది. అధ్యాపక సంఘాలు ఈ నివేదికను కూడా త్రోసిపుచ్చాయి. రస్తోగీ కమిటీ అధ్యాపకుల వేతనాలతో పాటు అనేక సంస్కరణలను సూచించింది. సర్వీసు నిబంధనలు, పదోన్నతి ప్రక్రియను కఠి నతరం చేసింది. ప్రస్తుతం 2,200 రూపాయలున్న లెక్చరర్‌ ‌మూలవేతనాన్ని 8 వేల రూపాయలకు పెంచాలని రస్తోగీ కమిషన్‌ ‌సిఫార్సు చేసింది. అలాగే 3000 రూపాయలున్న సీనియర్‌ ‌లెక్చరర్‌ ‌స్కేలును 10 వేల రూపాయలకు, 3700 రూపాయలుగా ఉన్న రీడర్‌ ‌స్కేలును 12 వేలకు, 4500 లుగా వున్న ప్రొఫెసర్‌ ‌మూలవేతనాన్ని 14 వేలకు పెంచాలని కమిషన్‌ ‌సూచించింది. ఇది పూర్తిగా అన్యాయమైన పెంపుదల అని అధ్యాపకులు ఆందోళనకు దిగారు. నిజానికి రస్తో గీ కమిషన్‌ ‌చేసింది కూడా పెద్దగా ఏమీ లేదు. ప్రస్తుతం ఉన్న మూలవేతనాన్ని, కరువు భత్యాన్ని కలిపి కొత్త స్కేలుగా చూపించింది. అలాగే ప్రమోషన్‌ ‌విధానాన్ని కూడా సవరిం గాలని సూచించింది.
 
అధ్యాపకుల ఆందోళన లితంగా యుజిసి 1997 డిసెంబర్లో రస్తోగీ కమిటీ సిఫార్సులకు పలు సవరణలు గీసి తుది నివేదికను ప్రభుత్వానికి పంపింది. కేంద్రమానవ వనరుల అభివృద్ధిశాఖకు సమర్పించిన ఈ ప్రతిపాదనల్లో లెక్చరర్‌ ‌ప్రారంభ మూలవేతనం 10 వేల రూపాయ లుగా, రీడర్కు 14 వేల మూడు వందల రూపాయలు, ప్రొఫెసర్కు కనీస వేతనం 18 వేల నాలుగు వందల రూపాయలుగా సిఫార్సు చేసింది. కేంద్ర ప్రభుత్వం సాధారణంగా ఈ సిఫార్సులను ఆమోదించి ఉత్వర్వులు జారీ చేయాలి. యుజిసి సిఫార్సులు అమలు చేయ వలసిందిగా వివిధ రాష్ట్రాలకు ఆదేశాలివ్వాలి. కానీ అందుకు భిన్నంగా యుజిసి సిఫార్సులపై కోత విధించింది. వాటిని యధాతధంగా అమలు చేయకుండా అంతకు ముందు రస్తోగీ కిమిటీ సిఫార్సు చేసినట్టుగా జీతభత్యాలు నిర్ధారిస్తూ జూలై 27న ఉత్వర్వులు జారీ చేసింది. దీనివల్ల అధ్యాపకులకు ప్రతి క్యాడర్లోనూ నెలకు రెండేసి వేల రూపాయల నష్టం కలిగింది. అలాగే స్వయం ప్రతిపత్తి గల యుజిసి వ్యవహారాల్లో మంత్రిత్వశాఖ జోక్యం విస్మయం కలిగించింది.
 
యుజిసి చట్ట బద్ధంగా ఏర్పాటైన సంస్థ. పార్లమెంటు చట్టం ద్వారా ఇది ఏర్పాటైంది. యుజిసి నిర్ణయా లను తోసిపుచ్చే అధికారం ఒక మంత్రిత్వ శాఖకు ఎలా ఉంటుంది’ అని కాకతీయ విశ్వవిద్యాలయం అధ్యాపకుల సంఘం (అకుట్‌) ‌ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ ‌పాపిరెడ్డి ప్రశ్నించారు. ‘ఇప్పుడు యుజిసి స్వతంత్ర ప్రతిపత్తికి, చట్టబద్ధతకే ముప్పు వచ్చింది’ అని ఆయన అన్నారు. దేశ వ్యాప్తంగా అధ్యాపకులంతా ఇదే అభిప్రాయంతో వున్నారు. జీతభత్యాలే కాదు ఎలాంటి నియమ నిబంధనలైనా యుజిసి స్వయంగా నిర్ధారించాలి తప్ప ప్రభుత్వం అందులో ఒక మంత్రి జోక్యం మితిమీరితే తమ గౌరవం, ప్రతిష్ట దెబ్బతింటుందని అధ్యాపకులు అంటున్నారు. అయితే మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి ప్రొఫెసర్‌ ‌మురళీ మనోహర్‌ ‌జోషి మాత్రం ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్ధించుకుంటున్నారు. తాము ఐదో వేతన సంఘం సిఫార్సుల మేరకే అధ్యాపకుల జీతాలు సవరించామని అధ్యాపకులు ప్రారంభ జీతం కేంద్రంలో గ్రూప్‌ ఎ. అధికారుల వేతనాలతో సమానంగా వుండేలా చూశామని ఆయన అంటున్నారు. సమ్మె అన్యాయమని, రాజకీయ కుట్ర అనీ పూర్వాశ్రమంలో ప్రొఫెసర్‌గా పని చేసిన ఈ మంత్రి టీచర్లపై దుమ్మెత్తి పోస్తున్నారు.
ఎవరిదీ కుట్ర? అధ్యాపకుల వేతనాల సవరణ వివాదాస్పదం కావడం వెనుక కుట్ర ఉన్న మాట వాస్తవమేనని అయితే కుట్ర చేసింది. మాత్రం కేంద్ర ప్రభుత్వంలోని ఐఏఎస్‌ అధికారులని ప్రభుత్వం వారితో కుమ్మ క్కయి అధ్యాపకులకు ద్రోహం చేసిందని అధ్యాపక సంఘాలు అంటున్నాయి. అధ్యాపకులు ఐఏఎస్‌ ‌మధ్య ప్రచ్ఛన్న యుద్ధం గత ఐదు సంవత్సరాలుగా కొన సాగుతూనే వున్నది. విశ్వవిద్యాలయాల ఆధ్యాపకులకు ఐఎఎస్‌ అధికారులతో ‘సమానంగా జీతాలివ్వాలని, అప్పుడే ప్రతిభావంతులైన వారిని ఈ వృత్తిలోకి ఆకర్షించగలుగుతామని అనేక కమిటీలు చేసిన సిఫార్సులను ప్రభుత్వం బుట్టదాఖలు చేసింది. కమిషన్లు ఏది చెప్పినా దాన్ని చర్చించి విధాన నిర్ణయం చేసేది ఐఏఎస్‌ ‌కావడం వల్ల ఈ సిఫార్సులు కార్యరూపం దాల్చలేదు. ఐతే టీచర్లకు ఇతర కేంద్ర ప్రభుత్వ గ్రూప్‌ ఎ ఉద్యోగుల వేతనాలు వర్తించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ జీతాలు గ్రూప్‌ ఎ ‌జీతాలతో సమానంగా వున్నట్టు కనిపిస్తాయి కానీ రెండు కేడర్ల మధ్య తీవ్ర వ్యత్యాసం వుందని అధ్యాపకులు అంటున్నారు. ఒక ఐఏఎస్‌ అధికారి లేదా గ్రూప్‌ ఎ అధికారి కనీస విద్యార్హత డిగ్రీ మాత్రమే. ఈ అర్హతను ఇరవై సంవత్సరాలలోపే సాధిస్తారు. ఆ తరువాత సివిల్‌ ‌సర్వీసెస్‌ ‌పరీక్షలు, నియామకాలకు ఐదేళ్లు వేసుకున్నా సగటున 25 సంవత్సరాలకు ఐఏఎస్లు ఉద్యోగాల్లో చేరుతున్నారు. అదే టీచర్లకు కనీస విద్యార్హత పిహెచ్‌ అం‌టే డిగ్రీ తరువాత రెండేళ్ల పి.జి., రెండేళ్ల ఎంఫిల్‌, ‌నాలుగేళ్ల పిహెచ్‌ఐ ‌పూర్తిచేయాలి. అంటే 30 సంవత్సరాల లోపు ఎవరైనా విశ్వవిద్యాలయాల్లో అధ్యాపక వృత్తిలో చేరడం సాధ్యం కాదు. ఆ అవకాశాలు కూడా పరిమితం. ఈ లెక్కన అధ్యాపకులు ఐఏఎస్లు ఇతర అధికారుల కంటే ఐదారేళ్లు ఆలస్యంగా వృత్తిలో చేరుతున్నారు. పైగా రేపటి ఐఏఎస్లు, ఐపిఎస్లను తయారు చేసే విద్యాలయాల్లో బోధకులుగా వుంటున్నారు. అటువంటప్పుడు ఐఎఎస్ల కంటే, ఇతర కేంద్ర ప్రభుత్వ అధికారుల కంటే తక్కువ జీతాలు ఉండడం ఎంత వరకు సమంజసమన్నది ప్రశ్న. అధ్యాపకులకు ఉన్నతమైన వేతన స్కేళ్లు ఉండాలని 1948 లో రాధాకృష్ణన్‌ ‌కమిషన్‌, 1960‌లో కొఠారీ కమిషన్‌ ఆ ‌తరువాత సేన్‌ ‌కమిటీ, మల్హోత్రా కమిటీ సిఫార్సు చేసినా ఐఏఎస్లు అడ్డుకుం టూనే వచ్చారన్నది టీచర్ల వాదన.
వేతన వ్యత్యాసంలో రెండో అంశం ప్రమోషన్లు. ఐఏఎస్‌కు ఇతర అధికారులకు ప్రమోషన్ల విషయంలో ఎలాంటి అడ్డంకులు లేవు. ఎలాంటి పరీక్షలు నియమ నిబంధనలు వుండవు. కానీ టీచర్లకు ప్రమోషన్‌ ఒక యజ్ఞం. పరిమిత మైన అవకాశాలు, కఠినమైన నిబంధనల వ•లంగా 95 శాతం మంది అధ్యాపకులు రీడర్లుగానే పదవీ విరమణ చేస్తున్నారు. కేవలం ఐదు శాతం మంది మాత్రమే ప్రొఫెసర్లుగా పదోన్నతి పొందుతున్నారు. అలాగే ఐఏఎస్లకు తమ సర్వీసులో కనీసం 8 సార్లు ప్రమోషన్‌ ‌వుంటుంది. అదీ సమయ నిర్దేశితంగా ప్రతి నాలుగేళ్లకోసారి వుంటుంది. అధ్యాపకులకు మాత్రం ఈ అవకాశం వచ్చేది నాలుగు సార్లే. దీంతో పదవీ విరమణ చేసే నాటికి రెండు క్యాడర్ల మధ్య వేతన వ్యత్యాసం వేలల్లో వుంటుంది. ఒక రకంగా పదవీ విరమణ చేసే నాటికి గ్రూప్‌ ఎ ‌సర్వీసు కాదుగదా, గ్రూప్‌ ‌బి కంటే కూడా అధ్యాపకులకు తక్కువ జీతం వస్తోంది. ఇది అధ్యాపక వృత్తిలో ఉన్న వారిని తీవ్రవేదనకు గురి చేస్తోంది.
అసమానతలు, పేదరికం, నిరక్షరాస్యత, నిరుద్యోగం వంటి సమస్యలతో సతమతమవుతున్న మన దేశంలో ఉన్నత విద్యారంగానికి అత్యంత ప్రాధాన్యత వుంది. ఇందులో అధ్యాపకుల పాత్ర కీలకమైంది. ఈ కీలక వృత్తిలోకి ప్రతిభగల వారిని, మేధావులను ఆకర్షించాలంటే ఇతర రంగాల కంటే మెరుగైన జీతాలుండాలని డాక్టర్‌ ‌సర్వేపల్లి రాధాకృష్ణన్‌ (1948) ‌నుంచి మొదలుకొని ఇప్పటి రస్తోగీ కమిషన్‌ (1998) ‌వరకు సిఫార్సులు చేస్తూనే వచ్చాయి. ఈ కమిషన్ల సిఫార్సులను అమలు చేయక పోవడం వల్ల, ప్రయివేటు మార్కెట్‌ ‌విస్తరించడం, కొత్త వృత్తులు, ఉద్యోగ వర్గాలు ఆకర్షించడంతో సహజంగానే ప్రతిభా వంతులకు గిరాకీ పెరిగింది. గత -దశాబ్ద కాలంగా ముఖ్యంగా నూతన సంస్కరణలు వచ్చిన తరువాత అధ్యాపక వృత్తి ప్రతిభావంతులను ఆకర్షించలేక పోతోంది. విశ్వవిద్యాలయాల స్థాయిలో రాజకీయాలు చేసే విద్యార్ధి సంఘాల నేతలు, ప్రొఫెసర్ల చుట్టూ ప్రదక్షిణలు చేసే విధేయులైన స్కాలర్లే టీచర్లవుతున్నారన్న విమర్శ కూడా వుంది. మరో వైపు కంప్యూటర్స్, ‌మేనేజ్‌మెంట్‌ ‌కవ్యనికేషన్స్ ఇతర సైన్స్ ‌కోర్సులు చదివే విద్యార్థులకు జాబ్‌ ‌మార్కెట్‌ ‌విస్తరించడం, వాళ్ల విద్యార్థులకు కంపెనీలు ఆఫర్‌ ‌చేస్తున్న తొలి జీతంతో సమానమైన జీతం కూడా ప్రొఫెసర్లకు అందక పోవడం కూడా అధికార వర్గాల్లో ఈ విచారానికి, వైమనశ్యతకు కారణం అవుతోంది.
 
గత పదేళ్లలో పెరిగిన ధరలు, మార్కెట్లో వచ్చిన మార్పులు చూసిన తరువాత ఈ జీతాలతో మరో పదేళ్లపాటు కాలం వెళ్లదీయడం అంటే కష్టమేనని అధ్యాపకులు అంటున్నారు. స్వతంత్ర వ్యవస్థగా వున్న యుజిసి నిర్ధారించిన జీతాలను పక్కకు పెట్టడం ఉన్నత విద్యా రంగంపై రాజకీయ పట్టు బిగించడమేననే అభిప్రాయం ఉన్నత విద్యారం గంలో వ్యక్తం అవుతోంది. మురళీ మనోహర్‌ ‌జోషి మానవ వనరుల మంత్రిగా వచ్చిన తరువాత ఈ జోక్యం మరీ పెరిగింది. పాఠ్య ప్రణాళికల్లో వేదాలు, హిందూ సంస్కృతిని చొప్పించే ప్రయత్నాలు ఇప్పటికే మొదలైంది. మరోవైపు అధ్యాపకుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా అధ్యాపక సంఘాల్లో కూడా చీలిక తెచ్చే ప్రయత్నాలు తీవ్రంగా జరిగాయి. బి.జె.పి., అనుబంధ సంస్థలు, సంఘాలు ఢిల్లీ విశ్వవిద్యాలయ అధ్యాపక సంఘాన్ని నిలువునా చీల్చి సమ్మె విఫలం చేయడానికి ప్రయత్నించాయి. చివరికి చరిత్రలో తొలిసారిగా అధ్యాపకులు అధ్యాపక దినాన్ని బహిష్కరించాలని పిలుపునిచ్చారు. జైల్బరో వంటి మిలిటెంట్‌ ‌చర్యలకు దిగారు. ఈ పరిణామాలన్నిటికీ కారణాలు ఏవైనా బాధ్యత మాత్రం ముమ్మాటికీ ప్రభుత్వానిదే. సమయస్ఫూర్తి, సంయమనంతో వ్యవహరిస్తే ఈ నష్టం జరిగి వుండేది కాదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *