“2014 నుండి 2026 వరకు ఈశాన్య ప్రాంత ప్రజలపై జరిగిన నేరాలకు సంబంధించిన గణాంకాలను పరిశీలిస్తే, నమోదైన 2,656 ఎఫ్‌ఐఆర్‌లలో కేవలం 33 కేసుల్లో మాత్రమే నిందితులకు శిక్ష పడింది. అంటే శిక్ష పడే రేటు కేవలం 1.8% మాత్రమే. ఈశాన్య ప్రాంత ప్రజలకు సంబంధించిన కేసుల్లో 55% సందర్భాల్లో నిందితులను గుర్తించడంలో పోలీసులు విఫలమయ్యారని పోలీసు గణాంకాలు చెబుతున్నాయి..”
దిల్లీలో ఇటీవల మణిపురి సంగీత ఉపాధ్యాయుడి హత్యపై, అంత్యక్రియలు నిర్వహిస్తున్న ప్రధానోపాధ్యాయుడు, “ఇదే చివరిది కావాలి” అని అన్నారు. 54 ఏళ్ల సంగీతకారుడు చోంగ్‌థమ్ విక్రమ్ సింగ్‌ను, సెప్టెంబర్ 6, 7 తేదీల రాత్రి దిల్లీలోని కిలోకారిలో, ఆశ్రమ్ సమీపంలో ఒక మూక కొట్టి చంపింది.

జర్నలిస్ట్ ,న్యూ దిల్లీ )
కింది అంతస్తులో చాలా గందరగోళంగా ఉండటంతో, అతను ఆ మూకను శాంతింపజేయడానికి వెళ్ళాడు. దీనిని అవకాశంగా తీసుకున్న ఆ మూక, అతన్ని చితకబాది, మూడవ అంతస్తులో ఉన్న అతని ఇంటికి వెళ్లి, వెంబడించి దాడి చేసింది. ఈ మూక సీసీటీవీ ఫుటేజీలో రికార్డయింది. దిల్లీ పోలీసులు ఇప్పటివరకు ఏడుగురి పేర్లను ప్రథమ సమాచార నివేదిక (ఎఫ్ ఐఆర్)లో నమోదు చేశారు. ఒక సంగీత ఉపాధ్యాయుడికి, లేదా ధ్వని తరంగాలు, వాటి పౌనఃపున్యాలపై అవగాహన ఉన్న వ్యక్తికి, సహజంగానే శబ్దం పట్ల విముఖత ఉంటుంది. దేశ రాజధాని నిజంగానే సంగీత రహితంగా మారింది. అనేక రాగాలను కనుగొని, ఎన్నో పద్యాలు రచించిన అమీర్ ఖుస్రో నగరం, ఇప్పుడు ధ్వని మార్పు కళ తెలియని, సంగీతాభిరుచి లేని మొరిగే కుక్కల చేతిలోకి వెళ్లిపోయింది. దేశంలో అసహనం పెరిగిపోతుండగా, చోంగ్‌థమ్ వంటి వారు దానిని ఎదిరించే సాహసం చేసి, ఖుస్రో సంప్రదాయాన్ని అనుసరించారు.
నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశంలో అధికారాన్ని కేంద్రంగా చేసుకున్నప్పటి నుండి, భారతదేశపు సుదీర్ఘ చరిత్రలో ఎన్నడూ లేనంతగా మూర్ఖత్వం తన గొంతును బిగ్గరగా వినిపించడం ప్రారంభించింది. సహజీవనం, పరస్పర నమ్మకం అనే భావన లేని ప్రజలు, నరేంద్ర మోదీని తమ హీరోగా చేసుకున్నారు. ఆయన ఛాతీ బాదుకుంటే, ఆయన అనుచరులు ఇతరులను చితకబాదారు. ఈ రోజుల్లో దిల్లీ ప్రజలు మరింత అసహనంగా తయారవుతున్నట్లు కనిపిస్తోంది. వారు చిన్న చిన్న విషయాలకే గొడవ పడటానికి సిద్ధంగా ఉన్నట్లు ఉన్నారు. వారి పౌర స్పృహ ఆవిరైపోయింది. ప్రతి ఒక్కరూ విపరీతంగా హారన్లు కొడుతున్నారు. ఈ నగరం కొందరు వ్యక్తుల వశమైపోయినట్లుంది, వారిలో కొందరు వారి బాస్‌గా ఉన్నారు.
కొన్నిసార్లు, ఈ మధ్య దిల్లీ వాస్సేపూర్‌గా మారిపోయిందేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే, ఎవరిపైనైనా కుట్ర పన్నడానికి సిద్ధంగా ఉన్న ముఠాలు ఎన్నో పనిచేస్తున్నాయి. ప్రతిరోజూ ప్రభుత్వ అధికారులు, కార్మికులు, ప్రైవేట్ వ్యక్తుల మధ్య ఎన్నో రోడ్ రేజ్‌లు, గొడవలు జరుగుతున్నాయి. ప్రతిఒక్కరూ కోపంగానే కనిపిస్తున్నారు. దిల్లీ ఎందుకింత కోపంగా మారుతోంది? ఎన్నో ఏళ్లుగా ఇక్కడ నివసిస్తున్న వారికి ఈ కోపం కొత్తగా అనిపిస్తోంది. ఇదివరకు ఇక్కడ ఇలా ఉండేది కాదు. వివిధ నేపథ్యాలకు చెందిన ప్రజలకు నిలయమై, వారి పట్ల ఎలాంటి వివక్ష చూపకుండా, పైగా వారిని తమవారిగా భావించి ఆదరించడం పట్ల దిల్లీ గర్వపడేది. “దిల్ వాలొం కి దిల్లీ” (ఉదార హృదయుల దిల్లీ) అనే ప్రసిద్ధ నినాదం దిమమంమల్లీ గమనాన్ని నిర్దేశించేది. కానీ ఇప్పుడు, ఆ దిల్లీ తన దారి తప్పింది.
ఈ నేపథ్యంలో చూసినప్పుడు, ఆ సంగీత ఉపాధ్యాయుడి హత్య ఘటన పూర్తి చిత్రాన్ని ఆవిష్కరిస్తుంది. చోంగ్థమ్ తన భార్య, కుమారుడితో కలిసి కిలోకారిలో నివసించేవారు. దిల్లీలో ఈశాన్య ప్రాంత ప్రజలపై జరుగుతున్న జాతి వివక్షలో భాగంగానే తన తండ్రి హత్య జరిగిందని ఆయన కుమారుడు పేర్కొన్నారు. చోంగ్థమ్ భార్య చెప్పిన మాటల్లో అత్యంత కీలకమైనది ఇది: “మా వారిని అత్యంత క్రూరంగా హత్య చేసినందుకు కేవలం న్యాయం మాత్రమే కోరుకుంటున్నాము.” 2014 నుండి 2026 వరకు ఈశాన్య ప్రాంత ప్రజలపై జరిగిన నేరాలకు సంబంధించిన గణాంకాలను పరిశీలిస్తే, నమోదైన 2,656 ఎఫ్‌ఐఆర్‌లలో కేవలం 33 కేసుల్లో మాత్రమే నిందితులకు శిక్ష పడింది. అంటే శిక్ష పడే రేటు కేవలం 1.8% మాత్రమే. ఈశాన్య ప్రాంత ప్రజలకు సంబంధించిన కేసుల్లో 55% సందర్భాల్లో నిందితులను గుర్తించడంలో పోలీసులు విఫలమయ్యారని పోలీసు గణాంకాలు చెబుతున్నాయి.
“ఈశాన్య రాష్ట్రాల ప్రజలపై ద్వేషపూరిత ప్రసంగాలు , జాతిపరమైన దూషణలు, వేధింపులు మ, వివక్ష వంటి ఘటనలకు సంబంధించిన సమాచారాన్ని కేంద్ర స్థాయిలో నమోదు చేయడం లేదు,” అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ తెలిపారు. అంటే, ఇవి నేరాలని భారత ప్రభుత్వానికి తెలుసు; కానీ దురదృష్టవశాత్తు, తాము భారతీయులమని స్పష్టంగా చెప్పుకునే ప్రజలపై జరిగే ఇటువంటి నేరాల రికార్డులను ప్రభుత్వం నిర్వహించడం లేదు! ఈశాన్య రాష్ట్రాల ప్రజలపై గతంలో కూడా హత్యలు జరిగాయి. 2014లో, దిల్లీలోని లజ్‌పత్ నగర్‌లో దుకాణదారులతో జరిగిన గొడవ తర్వాత అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన విద్యార్థి నిడో తానియా హత్యకు గురయ్యారు; ఈ ఘటన ఈశాన్య ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న వివక్ష , హింసపై దేశవ్యాప్త దృష్టిని ఆకర్షించింది. వాస్తవానికి, గత డిసెంబర్‌లో డెహ్రాడూన్‌లో త్రిపురకు చెందిన 24 ఏళ్ల విద్యార్థి ఏంజెల్ చక్మా ఒక గుంపు దాడిలో మరణించారు. దాడికి ముందు తన సోదరుడిని జాతిపరమైన దూషణలకు గురిచేశారని ఆయన సోదరుడు ఆరోపించారు. ఇలాంటి మరణాలు మరికొన్ని కూడా సంభవించాయి. నమోదైన కేసుల కంటే వాస్తవ ఘటనల జాబితా చాలా పెద్దది.
ఉత్తర భారతదేశంలో, ముఖ్యంగా దిల్లీ, దాని పరిసర ప్రాంతాలలో, ఈశాన్య రాష్ట్రాల ప్రజలపై, అలాగే దక్షిణాది ప్రజలపై కూడా జాతి వివక్ష ప్రబలంగా ఉంది. వాస్తవానికి, దేశంలోని ఇతర ప్రాంతాలలో నివసిస్తున్న ఈశాన్య ప్రాంత ప్రజల ఆందోళనలను బెజ్‌బరువా కమిటీ పరిశీలించింది. ఇది 2005 నుండి 2013 వరకు ఈశాన్య ప్రాంతం నుండి దిల్లీకి జరిగిన వలసలను అధ్యయనం చేసింది. రెండు లక్షలకు పైగా ప్రజలతో మాట్లాడిన తర్వాత, వారిలో 86% మంది జాతి వివక్ష మరియు ఇతర వివక్షలను ఎదుర్కొన్నారని ఆ కమిటీ పేర్కొంది. సహనం, పరస్పర గౌరవమే ముందుకు సాగే మార్గాలని విభజన గాయాల నుండి ఉత్తర భారతదేశం మరియు దిల్లీ నేర్చుకోలేదు. శబ్దానికీ, సంగీతానికీ మధ్య ఎంచుకోవాల్సి వచ్చినప్పుడు, అది ప్రభుత్వంలో అయినా, జీవితంలో అయినా, ఎల్లప్పుడూ సంగీతానికే ప్రాధాన్యత ఇవ్వడాన్ని దిల్లీ నేర్చుకోవాలి. దిల్లీ, చోంగ్‌థమ్ అంత్యక్రియలకు హాజరైన వ్యక్తి చెప్పినట్లుగా, అతని హత్యే చివరిది కావాలి.





