ఐదేళ్లలో 4 లక్షల 3వేల 664 కోట్ల అప్పులు

కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న అప్పు రూ.2 లక్షల 20 వేల కోట్లు
వెల్లడించిన కాగ్‌ నివేదిక …
అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన భట్టి విక్రమార్క

తెలంగాణ అసెంబ్లీలో గురువారం కాగ్‌ నివేదికను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఫైనాన్స్‌ అకౌంట్స్‌, అప్రోప్రియేషన్‌ అకౌంట్స్‌పై కాగ్‌ నివేదిక సమర్పించగా దానిని, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. ఇందులో 2023-24 బడ్జెట్‌ అంచనా రూ.2,77,690 కోట్లు- కాగా, చేసిన వ్యయం రూ.2,19,307 కోట్లు-గా చెప్పారు. గత ఐదేళ్లలో 4లక్షల 3వేల 664 కోట్ల అప్పులు చేసినట్టు సదరు కాగ్‌ రిపోర్టులో వెల్లడైంది. 2023-24 ఏడాదిలో పబ్లిక్‌ మార్కెట్‌ నుంచి రూ. 49,618 కోట్ల అప్పులు తీసుకున్నట్టు కాగ్‌ పేర్కొంది. గత ఏడాది కాలంలో 200 శాతం  పరిధి పెరిగినట్లు- తెలిపింది. పలు కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న అప్పు రూ.2 లక్షల 20 వేల కోట్లని వెల్లడించింది. వేతనాల కోసం రూ.26,981 కోట్లు- ఖర్చు చేసినట్టు- కాగ్‌ రిపోర్ట్‌లో వెల్లడైంది. ప్రభుత్వ ఖజానాకు పన్ను ఆదాయం నుంచే 61.89 శాతం నిధులు వస్తున్నాయని, 2023-24లో కేంద్రం నుంచి వచ్చిన గ్రాంట్లు రూ.9,934 కోట్లని కాగ్‌ వెల్లడిరచింది. రెవెన్యూ రాబడుల్లో 45 శాతం సర్కారీ ఉద్యోగుల వేతనాలకు తెచ్చిన అప్పులకు వడ్డీ చెల్లింపులు, పెన్షన్లకే ఖర్చవుతోందని నివేదికలో తెలిపింది. 2023-24లో రెవెన్యూ మిగులు రూ.779 కోట్లని, లోటు- రూ49,977 కోట్లుని స్పష్టం చేసింది. ప్రభుత్వ ఖజానాకు పన్ను ఆదాయం నుంచే 61.89 శాతం నిధులు వస్తున్నాయని, 2023-24లో కేంద్రం నుంచి వచ్చిన గ్రాంట్లు రూ.9,934 కోట్లని కాగ్‌ వెల్లడిరచింది. రెవెన్యూ రాబడుల్లో 45శాతం సర్కారీ ఉద్యోగుల వేతనాలకు తెచ్చిన అప్పులకు వడ్డీ చెల్లింపులు, పెన్షన్లకే ఖర్చవుతోందని నివేదికలో తెలిపింది. 2023-24లో రెవెన్యూ మిగులు రూ.779 కోట్లని, లోటు- రూ49,977 కోట్లు-ని స్పష్టం చేసింది.2023-24లో స్థానిక సంస్థలు, ఇతర సంస్థలకు రూ.76,776 కోట్లు- చెల్లింపులు జరిగాయని, 11 శాతం పెరుగుదల స్థానిక సంస్థలు, ఇతర సంస్థలకు ప్రభుత్వం నిధుల పెంపుదలగా చెప్పింది. 2022-24లో ప్రభుత్వం తీసుకున్న అప్పు రూ.53,144 కోట్లు-గా కాగ్‌ వెల్లడిరచింది. బడ్జెట్‌ అంచనాలో 79 శాతం వ్యయం అయిందని, ఆమోదం పొందిన బడ్జెట్‌ కంటే అదనంగా అంచనాల్లో 33 శాతం ఖర్చు కాగా, ఇది రూ.1,11,477 కోట్లు-గా కాగ్‌ నివేదికలో వెల్లడైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *