ప్రొటోకాల్‌ ఉల్లంఘనపై దానం ఆగ్రహం

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఆగస్ట్ 29 : ‌ఖైరతాబాద్‌ ‌డబుల్‌ ‌బెడ్‌ ‌రూంల లక్కీ డ్రాలో ప్రొటోకాల్‌ ‌రగడ నెలకొంది. ప్రొటోకాల్‌ ‌పాటించకపోవడంపై ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ ఆ‌గ్రహం వ్యక్తం చేశారు. బంజారాహిల్స్ ‌కొమరం భీమ్‌ ఆదివాసీ భవన్‌లో ఖైరతాబాద్‌ ‌గృహలక్ష్మి లబ్దిదారుల ఎంపిక కోసం లక్కీ డ్రా కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఎమ్మెల్యే నాగేందర్‌ ఈ ‌కార్యక్రమంలో పాల్గొని డ్రా ద్వారా లబ్దిదాలను ఎంపిక చేయాల్సి ఉంది. అయితే ఎమ్మెల్యే రాకముందే అధికారులు లక్కీ డ్రాను ప్రారంభించారు. దీనిపై దానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే వచ్చే వరకు ఆగకుండా డ్రా ఎలా ప్రారంభిస్తారని అధికారులపై సీరియస్‌ అయ్యారు. ప్రొటోకాల్‌ ఉల్లంఘించిన అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అధికారుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన దానం.. ‌కార్యక్రమం మధ్యలోనే అలిగి వెళ్లిపోయారు. కాగా, ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల‌ లక్కీ డ్రా హైదరాబాద్‌ ‌క్యూర్‌ ‌పరిధిలో కొనసాగుతోంది. కోర్‌ అర్బన్‌ ‌ప్రాంతంలోని తొలి విడతలో నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఈ ఇళ్ల కేటాయింపు పక్రియ నాలుగు రోజులపాటు పారదర్శకంగా జరగనుంది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *