దివ్యాంగులను విస్మరించిన కాంగ్రెస్ ప్రభుత్వం

– మాజీ మంత్రి హరీష్ రావు
– ప్రభుత్వ తీరుకు నిరసనగా దివ్యాంగుల ‘సమరశంఖారావం’

వనస్థలిపురం, ప్రజాసంత్ర, ఆగస్టు 29: ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్ర భుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా, దివ్యాం గుల హక్కుల సాధన కోసం “సమర శం ఖారావం” సభ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రు లు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస యా దవ్, సబితా ఇంద్రా రెడ్డి, మంచిరెడ్డి కిషన్ రెడ్డి హాజరై కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పలువురు దివ్యాం గుల సంఘాల నాయకులు పాల్గొని తమ హక్కుల కోసం గళమెత్తారు. దివ్యాంగులను విస్మరించిన కాంగ్రెస్ ప్రభు త్వం… ఎన్నికల ముందు దివ్యాంగులకు ఎన్నో హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ, అధి కారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయకుండా దివ్యాంగులను మోసం చేసిం ది. రూ.6,000 దివ్యాంగుల పెన్షన్ ఇస్తా మని హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ఆ హామీని ఎందుకు అమలు చేయడం లే దు? అని నాయకులు ప్రశ్నించారు. కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది. రూ. 500గా ఉన్న దివ్యాంగుల పెన్షన్ను రూ. 4,016కు పెంచింది. దివ్యాంగుల రిజర్వే షన్లను పెంచింది. దివ్యాంగుల హక్కుల చ ట్టాన్ని అమలు చేసి, వారి సంక్షేమం కోసం అనేక చర్యలు చేపట్టింది. కానీ కాంగ్రెస్ ఫ్ర భుత్వం మాత్రం హామీలు ఇవ్వడంలో ముం దుండి, వాటిని అమలు చేయడంలో పూర్తి గా విఫలమైంది. రాష్ట్రంలోని 5 లక్షలకుపై గా ఉన్న దివ్యాంగులకు పెన్షన్ బకాయిలు పేరుకుపోయినా, వాటిని చెల్లించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని నాయకులు మండిపడ్డారు. దివ్యాంగులకు రావాల్సిన పెన్షన్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వాన్ని నిలదీద్దాం

దివ్యాంగులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి. పెన్షన్ బకాయిలను తక్ష ణమే చెల్లించాలి.రూ.6.000 దివ్యాం గుల పెన్షన్ హామీని నెరవేర్చాలి.దివ్యాంగుల హ క్కులను, ఆత్మగౌరవాన్ని కాపాడాలి. ది వ్యాంగుల హక్కుల సాధన కోసం పోరాటం ఆగదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ లను అమలు చేసే వరకు, దివ్యాంగులకు న్యాయం జరిగే వరకు ఈ సమర శంఖా రావం కొనసాగుతూనే ఉంటుందని. నాయకులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *